రోహిత్, కోహ్లీకి గంభీర్ షాక్: రంజీల్లో ఆడండి!

First Published | Jan 8, 2025, 4:25 PM IST

virat Kohli and Rohit Sharma: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఘోరంగా విఫలమైన భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం క్రికెట్ సర్కిల్ లో నడుస్తున్న టాపిక్ గమనిస్తే బీసీసీఐ మరో గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకున్న భారత జట్టు స్వదేశానికి చేరుకుంది. అయితే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరిగిన 5 టెస్టుల సిరీస్‌లో భారత జట్టు ఘోరమైన ప్రదర్శనతో ట్రోఫీని కోల్పోయింది. పెర్త్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో మాత్రమే భారత్ 295 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత మాత్రం దారుణంగా ఓడిపోయింది. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓడింది. 

మూడో టెస్ట్ డ్రా అయింది. మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో ఓడిపోయింది.  సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత జట్టు ఓటమికి ప్రధాన కారణాలు గమనిస్తే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు కారణం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత్ ఓటమికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 

రోహిత్ శర్మ

కోహ్లీ, రోహిత్ బ్యాటింగ్ వైఫల్యం 

5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో  కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 6 సగటుతో 31 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్సీలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. దీంతో అతని పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, మొదటి టెస్టులో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకు వరుసగా ఔట్ కావడం ఆందోళన కలిగించింది.

వరుసగా విఫలమవుతున్న రోహిత్, కోహ్లీ రిటైర్ కావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, జట్టులో ఎందుకు ఇంకా ఉంచుతున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో సీనియర్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ వంటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

రోహిత్ శర్మకు బిగ్ షాక్.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాకు కొత్త కెప్టెన్


దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాల్సిందే ! 

భారత జట్టులో చాలా కాలంగా మూడు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఫామ్ ను అందుకోవడానికి విరాట్, రోహిత్ లు దేశవాళీ క్రికెట్ ను ఆడాలని సూచిస్తున్నారు. భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ''భారత సీనియర్ ఆటగాళ్లు రంజీ క్రికెట్ ఆడాలి. అలా ఆడితేనే అంతర్జాతీయ టెస్టుల్లో పరుగులు చేయడం సులభం అవుతుంది. సీనియర్లు రంజీల్లో ఆడాలని కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పాలి'' అని అన్నారు.

సిడ్నీ టెస్ట్ ఓటమి తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడారు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత ఆటగాళ్లు రంజీ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నీల్లో ఆడతారా? అని అడిగిన ప్రశ్నకు, ''అందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని నేను కోరుకుంటానని'' చెప్పారు.

క్రికెట్ లెజెండ్ కు అవ‌మానం.. టీమిండియాపై సునీల్ గ‌వాస్క‌ర్ ఫైర్

గౌతమ్ గంభీర్

పెద్ద టోర్నీలకు దేశవాళీ మ్యాచ్‌లు ప్రాక్టీస్‌గా ఉంటాయి: గంభీర్ 

''ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువగా ఆడే, రెడ్ బాల్ క్రికెట్‌కు కమిట్‌మెంట్ ఉన్నవారు దేశవాళీ క్రికెట్ ఆడాలి. దేశవాళీ మ్యాచ్‌లకు ప్రాధాన్యం ఇవ్వకపోతే, టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లను ఎంపిక చేయడం కష్టం. పెద్ద టోర్నీలకు దేశవాళీ మ్యాచ్‌లు ప్రాక్టీస్‌గా ఉంటాయి'' అని  గౌతమ్ గంభీర్ అన్నారు. 

శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి వారు దేశవాళీ క్రికెట్‌లో నిరంతరం ఆడుతున్నారనే విషయలు ప్రస్తావించారు. అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మళ్లీ దేశవాళీ క్రికెట్ లో ఆడి ఫామ్ అందుకుంటేనే జట్టులోకి తీసుకునే అవకాశాలను చెప్పకనే చెప్పారు గౌతమ్ గంభీర్.  మరీ గంభీర్ తర్వాతి సిరీస్ కోసం రోహిత్, విరాట్ కోహ్లీల విషయంలో  ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.. !

చాహల్-ధనశ్రీ విడాకుల పుకార్లు.. ఎమోషనల్ త్రోబాక్ వీడియో వైరల్

Virat Kohli Sand Paper

రంజీ ట్రోఫీలో కోహ్లీ, రోహిత్ చివరిసారి ఎప్పుడు ఆడారు?

2012లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఏడాది తర్వాత కోహ్లి చివరిసారిగా రంజీ ట్రోఫీలో ఆడాడు. అంటే భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చివరిసారిగా 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయిన సంవత్సరం టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. సిడ్నీ టెస్ట్ తర్వాత పఠాన్ తన ఆన్-ఎయిర్ రాంట్‌లో ఆధునిక-నాటి భారత క్రికెటర్లు దేశీయ క్రికెట్‌కు ప్రాధాన్యతనివ్వడంలో నిబద్ధత లేకపోవడంపై చేసిన కామెంట్స్ చ‌ర్చ‌కు తెర‌లేపాయి.

మరోవైపు రోహిత్ తొమ్మిదేళ్లుగా దేశవాళీ టోర్నీ ఆడలేదు. అంతేకాకుండా, గత నాలుగేళ్లలో, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్ కీలకమైన భారత టెస్టు ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో ఆడలేదు.

Latest Videos

click me!