భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఈ జంట త్వరలో విడాకులు తీసుకోవచ్చని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వారు చాలా కాలంగా కలిసి కనిపించలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. చాహల్ తన భార్యతో ఉన్న అన్ని చిత్రాలను తొలగించడం, పలు పోస్టుల్లో గూఢమైన విషయాలు పంచుకోవడం విడాకుల ఊహాగానాలకు ఊతమిచ్చింది. అయితే, వీరి విడాకుల కథనాలపై చాహల్ గానీ, ధనశ్రీ కాని ఇంకా అధికారిక ప్రకటన లేదు. అయితే, ఇప్పుడు ధనశ్రీ భావోద్వేగానికి లోనవుతూ ఏడిస్తున్నట్టు కనిపించే వీడియో ఒకటి వైరల్ గా మారింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ చాహల్ తో విడాకుల ఊహాగానాల నడుమ, ధనశ్రీ ఎమోషనల్ అవుతూ ఏడుస్తున్నట్టు కనిపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. ఆమె భర్త చాహల్ కూడా వీడియోలో కనిపిస్తున్నాడు, ఇద్దరూ చాలా భావోద్వేగానికి లోనవుతున్నట్లు కనిపిస్తున్నారు. ధనశ్రీ ఏడుస్తూ తన భర్తతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ వీడియోలో, యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఏడుస్తూ మాట్లాడుతున్నట్లు మీరు చూడవచ్చు. ఆమె చాలా భావోద్వేగానికి లోనైనట్లు, దేనికో చాలా బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె వీడియోలో, "అవును, నేను క్రమంగా కోలుకుంటాను. నేను మళ్ళీ ప్రయత్నించాను. అది సరైన ఫలితాన్ని ఇవ్వకపోతే, చూద్దాం. కానీ నేను మునుపటి కంటే బాగానే ఉన్నాను" అని చెబుతోంది.
యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ ప్రతిభావంతులైన మంచి డ్యాన్సర్. కొరియోగ్రాఫర్. ఆమె తన అద్భుతమైన డ్యాన్స్ తో కదలికలతో ప్రేక్షకుల హృదయాలను చాలాసార్లు గెలుచుకుంది. ప్రముఖ టీవీ రియాలిటీ షో జలక్ దిఖ్లా జా సీజన్ 11లో ఆమె తన అద్భుతమైన నృత్య నైపుణ్యాలను ప్రదర్శించింది. ఆమె ప్రేక్షకుల హృదయాలను మాత్రమే కాకుండా షోకు వచ్చిన జడ్జెస్ లను కూడా ఆకట్టుకుంది. అయితే, ఆమె ఫైనల్లో రన్నరప్‌గా నిలిచింది. ఆమెకు మద్దతుగా చాహల్ కూడా ఒకసారి షోలో కనిపించాడు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనలు వచ్చాయి.
ధనశ్రీ వర్మ ఆర్థికంగా కూడా చాలా విజయవంతమైనది. ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా మంచి ఆదాయం పొందుతుంది. ఆమె తెలుగు సినిమా కూడా త్వరలో విడుదల కానుంది, అక్కడ ఆమె తన నృత్య ప్రతిభను ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం, ఆమె తన సినిమా షూటింగ్‌లో పూర్తిగా నిమగ్నమై ఉంది. ఆమె గతంలో అనేక ఆల్బమ్‌లలో తన డ్యాన్స్ తో అదరగొట్టింది. ధనశ్రీ వర్మ వైరల్ వీడియో 👉[వీడియో చూడండి]
Yuzvendra Chahal-Dhanashree Verma
కాగా, చాహల్, ధనశ్రీ వివాహం 2020లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇద్దరూ తమ బంధాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా తెలియజేశారు. ఇప్పుడు వీరి విడాకుల పుకార్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చాహల్ భారత క్రికెట్ లో స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. ఇప్పటివరకు 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. భారతదేశం కోసం అతని చివరి మ్యాచ్ ఆగస్ట్ 2023లో వెస్టిండీస్‌తో టీ20 ఆడాడు. టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన భారత జట్టులో చాహల్ కూడా ఉన్నాడు కానీ ఒక మ్యాచ్ ఆడలేకపోయాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన తర్వాత పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్లకు చాహల్ ను జట్టులోకి తీసుకుంది. IPL 2024లో చాహల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 6.50 కోట్లతో జట్టులో ఉంచుకుంది. అతను ఇంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్టు తరఫున కూడా ఆడాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా, 200 వికెట్ల మార్క్ ను అందుకున్న తొలి ప్లేయర్ గా రికార్డు సాధించాడు.