IPL2021 CSK vs DC: ధోనీ ధనాధన్ ఫినిష్... ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్...

First Published Oct 10, 2021, 11:21 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఎదురైన పరాభవానికి ఈ సీజన్‌ ద్వారా కసిగా కమ్‌బ్యాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్ 2021లో ఫైనల్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది

173 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌కి మొదటి ఓవర్‌లోనే షాక్ తగిలింది. మొదటి ఓవర్‌లోనే డుప్లిసిస్ 1 పరుగుకే అవుట్ చేశాడు నోకియా...

అయితే వన్‌డౌన్‌లో వచ్చిన రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి రెండో వికెట్‌కి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు...

ఆవేశ్ ఖాన్ వేసిన ఓవర్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 20 పరుగులు రాబట్టిన రాబిన్ ఊతప్ప, వరుస బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు...

ఐపీఎల్‌లో 25వ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న రాబిన్ ఊతప్ప, 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేసి టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

టూ డౌన్‌లో వచ్చిన శార్దూల్ ఠాకూర్, భారీ షాట్‌కి ప్రయత్నించి శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది చెన్నై...

ఆ తర్వాత అంబటి రాయుడు 1 పరుగుకే రనౌట్ అయ్యాడు. 112/1 స్కోరుతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ 7 పరుగుల తేడాలో నాలుగు వికెట్లు కోల్పోయింది...

ఆ తర్వాత మొయిన్ ఆలీతో కలిసి ఐదో వికెట్‌కి 30 పరుగులు జోడించాడు రుతురాజ్ గైక్వాడ్. 50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

గైక్వాడ్ అవుటయ్యే సమయానికి సీఎస్‌కే విజయానికి 11 బంతుల్లో 24 పరుగులు కావాలి... ఆవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్‌లో మొయిన్ ఆలీ ఓ ఫోర్, ధోనీ ఓ సిక్సర్ బాదడంతో 11 పరుగులు వచ్చాయి...

ఆఖరి ఓవర్ మొదటి బంతికే మొయిన్ ఆలీ అవుట్ కాగా ఆ తర్వాత వరుసగా మూడు ఫోర్లు బాదిన ఎమ్మెస్ ధోనీ, మ్యాచ్‌ను ముగించేశాడు... 

click me!