భావి భారత బౌలర్లకు చోటు దక్కేనా..? సఫారీ సిరీస్ లో సెలెక్టర్ల కన్నెవరిమీదో..?

Published : May 17, 2022, 10:23 PM IST

Ind vs SA T20I: ప్రతి ఐపీఎల్  సీజన్ లో పలువురు ఆటగాళ్లు తమ అద్భుత ఆటతీరుతో జాతీయ జట్టులోకి  చోటు దక్కించుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ  సీజన్ లో గతంలో ఎప్పుడూ లేనంతగా మనకు  మంచి బౌలర్లు దొరికారు. 

PREV
19
భావి భారత బౌలర్లకు చోటు దక్కేనా..? సఫారీ సిరీస్ లో సెలెక్టర్ల కన్నెవరిమీదో..?

టీమిండియా బలం ఎప్పుడూ బ్యాటింగే. హేమాహేమి బౌలర్లు జట్టులోకి వచ్చినా ఆధిపత్యం మాత్రం బ్యాటర్లదే. కానీ కొంతకాలంగా ఆ ట్రెండ్ మారుతోంది. మన బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు. ఇప్పటికే బౌలర్లలో కూడా  పోటీ పెరుగుతుండగా.. ఇక ఐపీఎల్ పుణ్యమా అని భారత జట్టులోకి యువ బౌలర్లు క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నారు. 

29

ప్రస్తుతం భారత జట్టులో కీలక బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా తో పాటు మరికొందరు ఐపీఎల్ లో దొరికిన ఆణిముత్యాలే. ఈ సీజన్ లో కూడా అలాంటి బౌలర్లు మరికొందరు లభ్యమయ్యారు.  గత రెండు, మూడు సీజన్ల నుంచి వీళ్లు ఐపీఎల్ లో భాగమవుతున్నా ఈ సీజన్ లో మాత్రం  మెరుగ్గా రాణించి సెలెక్టర్ల కంట పడ్డారు. 

39

భారత జట్టులోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న వీరిలో  పలువురు త్వరలో స్వదేశంలో జరుగబోయే దక్షిణాఫ్రికా తో సిరీస్  ద్వారా టీమిండియాకు ఎంపిక కావాలని భావిస్తున్నారు. ఈ సిరీస్ తో పాటు ఐర్లాండ్ సిరీస్ లో కూడా సీనియర్ బౌలర్లకు విశ్రాంతినిస్తున్న నేపథ్యంలో ఈ యువ పేసర్లు రాణించి  జాతీయ జట్టులో చోటు  సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు.  వారిలో ముఖ్యంగా వినిపించే పేర్లు కింది విధంగా ఉన్నాయి. 

49

ఉమ్రాన్ మాలిక్ : ఐపీఎల్ లో గత సీజన్ లోనే ఎంట్రీ ఇచ్చినా అతడి పూర్తిస్థాయి ప్రతిభ  2022 లోనే  చూశారు  క్రికెట్ అభిమానులు. ఈ సీజన్ లో 12 మ్యాచు (మంగళవారం ముంబై తో ఆడుతున్న మ్యాచ్ కాక)లలో 18 వికెట్లు పడగొట్టాడు. 

59

తన వేగంతో పాటు ఇప్పుడిప్పుడే లైన్అండ్ లెంగ్త్ మీద దృష్టి సారించిన ఉమ్రాన్.. ఇప్పటికే  ఈ సీజన్ లో  గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్ గా రికార్డులకెక్కాడు. ఉమ్రాన్ ప్రదర్శనపై బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కూడా ప్రశంసలు కురిపించడం గమనార్హం. 

69

అర్షదీప్ సింగ్ : ఐపీఎల్ లో  పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ పంజాబీ.. కట్టుదిట్టంగా బంతులు వేస్తూ  ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అర్షదీప్ బౌలింగ్ చూసి తీరాల్సిందే. 13 మ్యాచులలో పది వికెట్లు తీసుకున్న అతడి ఎకానమీ 7.83గానే ఉంది.  ఈ సీజన్ లో ఫాస్ట్ బౌలర్లలో ఎవరికీ అంత తక్కువ ఎకానమీ  లేదు. 

79

మోహ్సిన్ ఖాన్: లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న ఈ యువ పేసర్ బౌలింగ్ శైలి చూడటానికి ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ను పోలి ఉంటుంది. మోహ్సిన్ కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. అయినా ఎక్కడ తడబడకుండా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఐపీఎల్ లో  7 మ్యాచులాడి 10 వికెట్లు తీసుకున్న ఈ యూపీ బౌలర్..  స్లాగ్ ఓవర్స్ లో బాగా కట్టడి చేస్తున్నాడు.  

89

ఖలీల్ అహ్మద్ : ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ పేసర్ కూడా భారత జట్టులో స్థానం ఆశిస్తున్నాడు.  ఈ సీజన్ కు ముందు మెగా వేలంలో ఐదు కోట్ల రూపాయలతో ఢిల్లీ అతడిని చేజిక్కించుకున్నప్పుడు.. ఇతడికి ఇంత డబ్బు ఖర్చు  చేయడం అవసరమా..? అనుకున్నారంతా. కానీ ఈ సీజన్ లో ఢిల్లీ తరఫున 9 మ్యాచులాడిన అతడు ఏకంగా 16 వికెట్లు తీసుకున్నాడు. 

99

టి. నటరాజన్ : యార్కర్ల కింగ్ నట్టూ భారత జట్టుకు ఆడటం కొత్తేమీ కాకున్నా.. మధ్యలో పలు కారణాలతో  జాతీయ జట్టు నుంచి దూరమవుతున్నాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ తరఫున 10 మ్యాచులలో 18 వికెట్లు తీసుకున్న ఈ తమిళనాడు పేసర్.. తిరిగి జాతీయ జట్టులో స్థానం కోసం చూస్తున్నాడు.  

Read more Photos on
click me!

Recommended Stories