1. క్రిస్ గేల్ - 66 బంతుల్లో 175* పరుగులు (2013)
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)-పూణే వారియర్స్ ఇండియా (PWI) మధ్య జరిగిన మ్యాచ్‌లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఎప్పటికీ మర్చిపోలేని సునామీ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. గేల్ కేవలం 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లతో 175 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా మిగిలిపోయింది. ఇప్పటివరకు ధనాధన్ ఇన్నింగ్స్ లు చాలానే వచ్చాయి కానీ, గేల్ రికార్డును ఎవరూ బద్దలుకొట్టలేకపోయారు.
2. బ్రెండన్ మెకల్లమ్ - 73 బంతుల్లో 158* పరుగులు (2008)
ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడిన బ్రెండన్ మెకల్లమ్ విధ్వంస రేపాడు. ఆర్సీబీపై 158* పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. తన సూపర్ నాక్ లో 10 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. ఇది టీ20 క్రికెట్ లో కొత్త ఒరవడిని తీసుకువచ్చింది.
Abhishek Sharma
3. అభిషేక్ శర్మ - 55 బంతుల్లో 141 పరుగులు (2025)
ఐపీఎల్ 2025 27వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. మొత్తంగా 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141 పరుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. అతని ఇన్నింగ్స్ ఐపీఎల్ హిస్టరీలో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇన్నింగ్స్ గా నిలిచింది.
4. క్వింటన్ డి కాక్ - 70 బంతుల్లో 140* పరుగులు (2022)
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) తరపున ఆడుతున్న క్వింటన్ డి కాక్ 140* పరుగుల మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ను ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు.
5. ఏబీ డివిలియర్స్ - 59 బంతుల్లో 133* పరుగులు (2015)
ముంబై ఇండియన్స్ (MI) పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేయర్ ఏబీ డివిలియర్స్ 133* పరుగులు సూపర్ నాక్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఏబీడీ సూపర్ నాక్ తో ఆర్సీబీ బిగ్ స్కోర్ చేయడంలో కీలకంగా ఉన్నాడు.
6. కేఎల్ రాహుల్ - 69 బంతుల్లో 132* పరుగులు (2020)
పంజాబ్ కింగ్స్ (PBKS) కెప్టెన్‌గా, దుబాయ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పై కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. 132* పరుగులు అజేయ ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు.
Gill
7. ఏబీ డివిలియర్స్ - 52 బంతుల్లో 129* పరుగులు (2016)
గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ మరోసారి తన టీ20 సునామీ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 52 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్లతో 129 పరుగులు కొట్టాడు.
8. శుబ్‌మన్ గిల్ - 60 బంతుల్లో 129 పరుగులు (2023)
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న శుభ్‌మన్ గిల్ 129 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఇది అతని IPL కెరీర్‌లో ఒక ముఖ్యమైన ఇన్నింగ్స్ గా నిలిచింది.
9. క్రిస్ గేల్ - 62 బంతుల్లో 128* పరుగులు (2012)
ఢిల్లీ డేర్‌డెవిల్స్ తో జరిగిన మ్యాచ్‌లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి సునామీ ఇన్నింగ్స్ ను ఆడాడు. 128* పరుగులు అజేయ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ లో గేల్ బ్యాటింగ్ అధిపత్యాన్ని చూపించాడు.
10. రిషబ్ పంత్ - 63 బంతుల్లో 128* పరుగులు (2018)
ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున యంగ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా సర్ రైజర్స్ హైదరాబాద్ పై రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. 63 బంతుల్లో 128* పరుగులు అజేయ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు.