ఇదేం విధ్వంసంరా బాబూ... అభిషేక్ పిచ్చకొట్టుడుకు ఈ రికార్డులన్నీ షేక్
అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్‌పై వేగవంతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఈ ఒక్క సెంచరీతో అతడు చాలా రికార్డులు బద్దలు కొట్టాడు. అలా అభిషేక్ దెబ్బకు షేక్ అయిన ఆ రికార్డులేంటో తెలుసుకుందాం.
అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్‌పై వేగవంతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఈ ఒక్క సెంచరీతో అతడు చాలా రికార్డులు బద్దలు కొట్టాడు. అలా అభిషేక్ దెబ్బకు షేక్ అయిన ఆ రికార్డులేంటో తెలుసుకుందాం.
Abhishek Sharma Records : ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 247 పరుగులు చేసి విజయం సాధించింది. 247 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. వరుస ఓటముల తర్వాత సన్ రైజర్స్ కు మంచి విజయం దక్కింది.
ఓపెనర్ ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ సిక్సర్ల వర్షం కురిపించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ 14 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు.
అభిషేక్ శర్మ అద్భుతమైన ఆట వరుస ఓటములతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును అద్భుత విజయం సాధించేలా చేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ పలు రికార్డులు బద్దలు కొట్టాడు.
అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లో సెంచరీ చేశాడు, ఇది ఐపీఎల్‌లో ఒక భారతీయుడి మూడవ వేగవంతమైన సెంచరీ, మొత్తంగా ఐపిఎల్ చరిత్రలోనే ఇది ఐదవ వేగవంతమైనది.
అభిషేక్ శర్మ తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు కొట్టాడు. ఇది ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో ఒక భారతీయ ఆటగాడికి రెండవ అత్యధిక సిక్సర్లు. ఒక ఇన్నింగ్స్‌లో భారతీయ ఆటగాడు కొట్టిన అత్యధిక సిక్సర్లు 11. ఐపీఎల్ 2010లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నప్పుడు రాజస్థాన్ రాయల్స్‌పై మురళి విజయ్ 127 పరుగులలో 11 సిక్సర్లు నమోదు చేశాడు. అభిషేక్ దూకుడు చూసి ఈ రికార్డు బద్దలవుతుంది అందరూ అనుకున్నారు. కానీ అతడు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అంతేకాకుండా అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన 3వ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పంజాబ్ కింగ్స్‌పై వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సాధించాడు. అభిషేక్ శర్మ చేసిన 141 పరుగులే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు చేసిన అత్యధిక పరుగులు. 193.84 స్ట్రైక్ రేట్‌తో ఆడిన అతను టి20 క్రికెట్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాడిగా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.