IPL Salary: అప్పుల బాధతో ఇల్లు అమ్ముకున్న ఫ్యామిలీ.. ఐపీఎల్‌ ఆడి తండ్రి కష్టాలు తీర్చిన యంగ్ క్రికెటర్

Published : Jun 06, 2026, 07:14 AM IST

IPL Salary: అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇల్లు అమ్ముకున్న కుటుంబం.. ఐపీఎల్ పుణ్యమా అని రూ.2.6 కోట్ల శాలరీతో అప్పులన్నీ తీర్చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ ముకుల్ చౌదరి ఎమోషనల్ స్టోరీ ఇది..

PREV
16
ఇల్లు అమ్మేసిన తండ్రి.. ఐపీఎల్ ఆడి కోట్లతో అప్పు తీర్చిన కొడుకు

ఐపీఎల్ అంటే కేవలం ఫోర్లు, సిక్సర్లు, పైసల పండగ మాత్రమే కాదు.. ఎందరో పేద, మధ్యతరగతి యువకుల జీవితాలను మార్చే ఒక అద్భుతమైన గ్రౌండ్. ప్రతిభ ఉండి, సరైన సపోర్ట్ లేక వెనుకబడిన ఎంతో మంది యంగ్ క్రికెటర్లకు ఈ లీగ్ లైఫ్ ఇస్తోంది.

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ మెంబర్ ముకుల్ చౌదరి లైఫ్ కూడా ఇలాగే టర్న్ తీసుకుంది. పెద్దమొత్తంలో అప్పులతో మ్యాచ్‌లు ఆడిన ఈ యంగ్ సంచలనం.. ఇప్పుడు తన ఫ్యామిలీని కష్టాల నుంచి ఎలా గట్టెక్కించాడో తెలిస్తే ఎవరైనా ఎమోషనల్ అవ్వాల్సిందే.

26
సిక్సర్లతో మెరిసిన ముకుల్.. కేకేఆర్ గుండెల్లో రైళ్లు

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన మ్యాచ్‌లో ముకుల్ చౌదరి విధ్వంసం సృష్టించాడు. కేవలం 27 బంతుల్లోనే సిక్సర్ల వర్షం కురిపిస్తూ 57 పరుగులు రాబట్టాడు. తన వీరోచిత పోరాటంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అయితే, గ్రౌండ్‌లో అంత కాన్ఫిడెంట్‌గా సిక్సర్లు బాదిన ఈ కుర్రాడి వెనుక.. అప్పుల బాధతో కుంగిపోతున్న ఒక కుటుంబం ఉందనే విషయం అప్పట్లో ఎవరికీ తెలియదు.

36
అప్పుల ఊబిలో ఫ్యామిలీ.. ఇల్లు కూడా సేల్

ముకుల్ చౌదరి బ్యాక్‌గ్రౌండ్ చూస్తే చాలా సాధారణమైనది. వాళ్ల నాన్న ఒక స్కూల్ టీచర్, తాతయ్య రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. అయితే కుటుంబంలో అప్పులు ఎక్కువ కావడంతో, ఉన్న ఒకే ఒక్క ఇంటిని కూడా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత రిటైర్డ్ సైనికుడైన వాళ్ల తాతయ్య ఇచ్చిన డబ్బుతో ఒక చిన్న స్థలం కొన్నారు. మళ్లీ అప్పులు చేసి ఎలాగోలా ఇల్లు కట్టుకున్నారు. కానీ ఆ ల్యాండ్ లోన్, హోమ్ లోన్ ఈఎంఐలు కట్టలేక ఆ కుటుంబం తీవ్రమైన మానసిక ఆందోళనలో మునిగిపోయింది.

46
లైఫ్ మార్చేసిన లక్నో సూపర్ జెయింట్స్

ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా ముకుల్ చౌదరి క్రికెట్‌ను వదల్లేదు. పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. అతని టాలెంట్ గుర్తించిన లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 2.6 కోట్లకు ముకుల్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో లక్నో టీమ్ ఆశించిన స్థాయిలో పర్ఫార్మ్ చేయకపోయినా.. ముకుల్ చౌదరి మాత్రం వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా వాడుకుని బెస్ట్ గేమ్ ఆడాడు. తాజాగా ఐపీఎల్ ముగియడంతో లక్నో యాజమాన్యం అతనికి రావాల్సిన శాలరీని అకౌంట్‌లో వేసేసింది.

56
అప్పుల నుంచి విముక్తి.. ఫుల్ హ్యాపీ

ఐపీఎల్ ముగించుకుని కోట్లతో ఇంటికి చేరిన ముకుల్ చౌదరి.. తన సంపాదనతో కుటుంబానికి ఉన్న అప్పులన్నింటినీ పూర్తిగా తీర్చేశాడు. "ఇప్పుడు మా ఫ్యామిలీ అప్పుల బాధ నుంచి పూర్తిగా బయటపడింది. మా నాన్న, తాతయ్యల కళ్లలో ఆనందం చూశాను. నా జీవితంలో ఇంతకంటే పెద్ద సంతోషం ఇంకేముంటుంది?" అంటూ ముకుల్ ఎమోషనల్ అయ్యాడు.

66
ఐపీఎల్‌కు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా

కష్టకాలంలో ఉన్నప్పుడు తన టాలెంట్‌ను గుర్తించి ఛాన్స్ ఇచ్చిన ఐపీఎల్ టోర్నీకి, లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్‌మెంట్‌కు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ముకుల్ చెప్పాడు. అప్పుల భారం వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని, వాటన్నింటికీ ఈ ఐపీఎల్ విజయం ఒక ఫుల్‌స్టాప్ పెట్టిందని ఈ యంగ్ క్రికెటర్ ఎంతో గర్వంగా చెప్పుకొచ్చాడు.

Read more Photos on
click me!

Recommended Stories