Team India : వైభవ్ సూర్యవంశీ కాదు.. సంజూ శాంసన్ కాదు.. కోహ్లీని రీప్లేస్ చేస్తున్న సీఎస్కే స్టార్ ఎవరో తెలుసా?

Published : Jun 04, 2026, 09:29 PM IST

Team India : గాయం కారణంగా అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. వైభవ్ సూర్యవంశీ లేదా సంజూ శాంసన్ జట్టులోకి వస్తారని చర్చ సాగింది. కానీ, కోహ్లీ స్థానంలో సీఎస్‌కే స్టార్ ప్లేయర్ భారత జట్టులోకి రానున్నట్లు సమాచారం.

PREV
16
టీమిండియాకు భారీ షాక్.. గాయంతో విరాట్ కోహ్లీ అవుట్

భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. జూన్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రన్ మెషిన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ధర్మశాలలో జూన్ 13న మొదటి వన్డే మ్యాచ్ జరగాల్సి ఉండగా.. సరిగ్గా సిరీస్ స్టార్ట్ అయ్యే టైమ్‌కి కోహ్లీ అందుబాటులో లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి.

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతూ 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు కోహ్లీ. అయితే అదే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే కోహ్లీ ఈ గాయం బారిన పడ్డాడు. ఆ మ్యాచ్‌లో కాస్త అసౌకర్యంగా అనిపించినా అలాగే బ్యాటింగ్ కొనసాగించాడు.

26
కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ఎంట్రీ?

విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ ఎవరు అనే దానిపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది. వైభవ్ సూర్యవంశీ లేదా సంజూ శాంసన్ వస్తారని సోషల్ మీడియాలో టాక్ నడిచింది. అయితే, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ రూపంలో ఇప్పటికే ఇద్దరు వికెట్ కీపర్లు టీమ్‌లో ఉన్నందున.. మూడో వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ను తీసుకునే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

పలు మీడియా రిపోర్టుల ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కోహ్లీ స్థానంలో భారత వన్డే జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. నిజానికి గైక్వాడ్ ప్రస్తుతం శ్రీలంక టూర్‌కు వెళ్లే తిలక్ వర్మ నేతృత్వంలోని ఇండియా ఏ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గాయపడిన రియాన్ పరాగ్ స్థానంలో అతన్ని తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీనియర్ టీమ్ నుంచి పిలుపు రావడంతో గైక్వాడ్ అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్ ఆడనున్నాడు.

36
ఇండియా ఏ జట్టులో మార్పులు ఇవే

రుతురాజ్ గైక్వాడ్ మెయిన్ టీమ్‌లోకి ప్రమోట్ అవ్వడంతో.. శ్రీలంకలో అఫ్గానిస్థాన్ ఏ జట్టుతో కలిసి జరిగే త్రైపాక్షిక సిరీస్ కోసం ఇండియా ఏ స్క్వాడ్‌లో కూడా మార్పులు చేయాల్సి వచ్చింది. ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీని మరోసారి టైటిల్ విజేతగా నిలిపిన కెప్టెన్ రజత్ పటిదార్‌ను గైక్వాడ్ స్థానంలో ఇండియా ఏ జట్టుకు ఎంపిక చేయనున్నారు.

ఈ ఇండియా ఏ టీమ్ స్క్వాడ్‌లో ఐపీఎల్ 2026 సూపర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. కోహ్లీకి కనీసం రెండు వారాల పాటు కంప్లీట్ రెస్ట్ అవసరం అని డాక్టర్లు సలహా ఇచ్చారు. జూన్ 20న జరిగే చివరి వన్డే సమయానికి కోహ్లీ కోలుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ.. కేవలం మూడు మ్యాచ్‌లు ఉన్న చిన్న సిరీస్ కావడంతో సెలక్టర్లు అతని విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరని సమాచారం.

46
కోహ్లీకి అయిన గాయం ఏంటి?

పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ ప్రకారం.. విరాట్ కోహ్లీకి అయిన ఇంజ్యూరీ కాస్త అరుదైనది. స్కానింగ్ రిపోర్ట్స్‌లో అతనికి డిస్టల్ సెమీమెంబ్రానోసస్ టెండన్ టియర్ అయినట్లు బీసీసీఐ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. ఇది మోకాలి కింద ఉండే లోపలి భాగంలో కండరాలను ఎముకకు అనుసంధానించే మందపాటి టెండన్‌పై ప్రభావం చూపే అరుదైన హ్యామ్‌స్ట్రింగ్ గాయం.

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోహ్లీ అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు. 16 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో ఏకంగా 675 రన్స్ స్కోర్ చేశాడు. టెస్ట్, టీ20 ఫార్మాట్‌ల నుంచి ఇప్పటికే రిటైర్ అయిన కోహ్లీ.. తన పూర్తి ఫోకస్‌ను 2027 వన్డే వరల్డ్ కప్‌పైనే పెట్టాడు.

56
రుతురాజ్ గైక్వాడ్‌కు గోల్డెన్ ఛాన్స్

ఇక కోహ్లీ ప్లేస్‌లో వస్తున్న 29 ఏళ్ల మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఇది మంచి ఛాన్స్. ఐపీఎల్ 2026లో రూ.18 కోట్లకు సీఎస్‌కే అతన్ని రిటైన్ చేసుకోగా.. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 123.44 స్ట్రైక్ రేట్‌తో 337 రన్స్ చేశాడు. కానీ జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. గైక్వాడ్ ఇప్పటివరకు టీమిండియా తరపున 9 వన్డేలు ఆడి 228 రన్స్ చేశాడు. ఇందులో గత ఏడాది సౌతాఫ్రికాపై రాయ్‌పూర్‌లో చేసిన 105 పరుగుల సెంచరీ హైలైట్.

సౌతాఫ్రికాతో జరిగిన ఆ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 8 రన్స్ కే అవుట్ అయినా.. రెండో వన్డేలో 83 బంతుల్లోనే 105 రన్స్ బాదాడు. 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో బ్యాకప్ టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా నిలవాలంటే రుతురాజ్‌కు ఈ హోమ్ సిరీస్ ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్ జూన్ 13న ధర్మశాలలో, జూన్ 17న లక్నోలో, జూన్ 20న చెన్నైలో జరగనుంది. దీని తర్వాత ఇండియా ఐర్లాండ్ టూర్, ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లనుంది.

66
అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్ ఆడే భారత జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (గాయంతో దూరం), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.

Read more Photos on
click me!

Recommended Stories