ఎవరేమనుకున్నా పిచ్ మారదు, నాలుగో టెస్టుకి కూడా అలాగే ఉంటుంది... అజింకా రహానే కామెంట్!

First Published Mar 2, 2021, 6:12 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. పూర్తిగా ఆరు సెషన్ల పాటు కూడా సాగని ఈ మ్యాచ్ కారణంగా మొతేరా పిచ్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దాంతో ఈ ట్రోల్స్‌కి చెక్ పెట్టేందుకు భారత జట్టు, నాలుగో టెస్టుకి బ్యాటింగ్ పిచ్ తయారుచేస్తుందని టాక్ వినిపించింది. అయితే రహానే మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశాడు...

రెండో టెస్టు, మూడో టెస్టులో పిచ్ నాణ్యతపై ఇంగ్లాండ్ జట్టు, బ్రిటీష్ మీడియా తీవ్రమైన విమర్శలు చేసింది. అయితే ఈ విమర్శలకు ఏ మాత్రం భయపడబోమని, నాలుగో టెస్టుకి కూడా స్పిన్ పిచ్‌నే సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించాడు అజింకా రహానే...
undefined
‘టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడడం వరల్డ్‌కప్ ఆడడంతో సమానం. కాబట్టి నాలుగో టెస్టులో విజయం సాధించడం మాకు చాలా అవసరం. మూడో టెస్టు పిచ్‌ ఉన్నట్టుగానే నాలుగో టెస్టు పిచ్ ఉంటుంది... అందులో ఎలాంటి మార్పు ఉండదు...
undefined
పిచ్ స్పిన్‌కి అనుకూలిస్తోందని ఇంగ్లాండ్ జట్టు ఆరోపిస్తోంది. అయితే మాకైతే అలా అనిపించలేదు. పింక్ బాల్ టెస్టులో స్పందించినట్టుగా డే టెస్టులో పిచ్ బౌలర్లకు అనుకూలిస్తోందో లేదో తెలీదు...
undefined
మేం విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మేం విదేశాల్లో టూర్‌కి వెళ్లినప్పుడు, అక్కడి సీమ్ వికెట్ గురించి ఎవ్వరూ మాట్లడరు. గత రెండు టెస్టుల పిచ్ ప్రమాదకరంగా ఉందని నాకైతే అనిపించలేదు. జనాలు ఏమనుకుంటున్నారో పట్టించుకోనవసరం లేదు..
undefined
రెండో టెస్టుల్లో ఓడినంత మాత్రాన ఇంగ్లాండ్ జట్టును తేలికగా తీసుకోవడం లేదు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనేదే మా ముందున్న లక్ష్యం. చాలామంది నా పర్ఫామెన్స్ గురించి అడుగుతున్నారని తెలుసు.
undefined
కావాలంటే మీరు గణాంకాలు చూడండి... నేను కూడా నా వంతు కంట్రిబ్యూషన్ చేస్తున్నా. జట్టుకి అవసరమైనప్పుడు నేను పరుగులు చేస్తున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు అజింకా రహానే...
undefined
ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్ బెటర్ అంటూ డేల్ స్టెయిన్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు అజింకా రహానే. ‘ఐపీఎల్ చాలామంది క్రికెటర్లకు ఓ మంచి ఫ్లాట్‌ఫాం‌మ్‌ని అందించింది. ఎందరో భారత, విదేశీ ప్లేయర్లు ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చారు...
undefined
డేల్ స్టెయిన్ ఏం చెప్పాడో, ఎందుకు చెప్పాడో నాకైతే తెలీదు... నేను కేవలం ఇక్కడ టెస్టు మ్యాచ్ గురించి మాత్రమే మాట్లాడడానికి వచ్చాను’ అంటూ క్లారిటీ ఇచ్చాడు అజింకా రహానే...
undefined
click me!