యువరాజ్ సింగ్ భార్య హజల్ కీచ్ ఇలా అవ్వడానికి కారణం అదేనట... షాకింగ్ విషయం బయటపెట్టిన...

First Published Mar 2, 2021, 4:53 PM IST

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య, బాలీవుడ్ నటి హజల్ కీచ్‌ షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన ఫోటో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు ఎంతో అందంగా, నాజుగ్గా మెరిసేపోయే చర్మంతో కనిపించిన హజల్ కీచ్‌ని, పాలిపోయిన ముఖంలో చూసి అభిమానులు షాక్ అయ్యారు. అయితే తాను అలా అవ్వడానికి గల కారణాన్ని తెలియచేసింది మిసెస్ యువరాజ్ సింగ్...

1987, ఫిబ్రవరి 28న ఇంగ్లాండ్‌లో జన్మించిన హజల్ కీచ్, రెండు రోజుల క్రితం 34వ ఒడిలో అడుగుపెట్టింది. నటిగా వెండితెరపై వెలిగిపోవాలని కోటీ ఆశలతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన హజల్‌కీచ్‌కి ఆశించినంతగా అవకాశాలు మాత్రం రాలేదు...
undefined
ఆడపాదడపా సినిమాల్లో నటించినా, మెయిన్ హీరోయిన్‌గా కానీ, కీ రోల్‌లో కానీ కనిపించలేకపోయింది హజల్‌కీచ్. ఆమె చేసినవన్నీ సైడ్ క్యారెక్టర్లు, ఐటెం సాంగ్ స్పెషల్ అప్పీరియెన్స్‌లే...
undefined
2016లో సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పి, క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను పెళ్లాడింది హజల్ కీచ్... అయితే యువీ పెళ్లాడకముందు నుంచే ఆమె డిప్రెషన్‌తో బాధపడుతోందట. 22 ఏళ్ల వయసు నుంచే తాను డిప్రెషన్‌ను ఎదుర్కొంటున్నానని ప్రకటించింది హజల్ కీచ్...
undefined
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ ఫోటో ద్వారా తాను ఎదుర్కొంటున్న మానసిక సమస్య గురించి చెప్పుకొచ్చింది యువీ సతీమణి. ‘నేను ఎన్నో ఏళ్ల నుంచి డిప్రెషన్‌తో కలిసి జర్నీ చేస్తున్నా... ప్రతీరోజూ నేను స్లిమ్‌గా కనిపించాలని తహతహలాడుతూ ఉంటాను. నా జట్టును అలా వదిలేసి, ఓపెన్ హెయిర్‌తో కనిపించాలని తాపత్రయపడతాను...
undefined
నాకు నవ్వుతూ మాట్లాడేవారంటే చాలా ఇష్టం. అలావారికి కలవాడని నేనెంతో ఇష్టపడతాను. నా ముఖంలో ఎప్పుడూ నవ్వు కనిపించేలా జాగ్రత్త పడతా. నా ఆకలిని, నా సమస్యలను నవ్వుతో కప్పేస్తా... ఎవ్వరికీ తెలియని జోక్‌లు వేస్తుంటా...
undefined
నేను ఎప్పుడూ ఇంత ఆనందంగా, ఇంత ఆరోగ్యంగా ప్రశాంతమైన జీవితం గడుపుతానని ఎన్నడూ అనుకోలేదు... కానీ జీవితంలో ఏదో తెలియని వెలితిలా డిప్రెషన్ నన్ను వెంటాడుతూనే ఉంది...’ అంటూ చెప్పుకొచ్చింది హజల్ కీచ్...
undefined
2016, నవంబర్ 30న యువరాజ్ సింగ్, హజల్ కీచ్‌ల వివాహం జలంధర్‌లో సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగింది. ఆ తర్వాత గోవాలో మరోసారి హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారీ ఇద్దరు. యువరాజ్ సింగ్ రిసెప్షన్ పార్టీకి భారత క్రికెటర్లు అందరూ హాజరయ్యారు...
undefined
హజల్‌ కీచ్‌ను కాఫీ డేట్‌కి పిలిచేందుకే మూడేళ్ల పాటు కష్టపడ్డాడట యువరాజ్ సింగ్. యువీ అడిగిన వెంటనే కాఫీకి వస్తానని చెప్పిన హజల్ కీచ్, సరిగ్గా ఆ రోజు వచ్చేసరికి ఫోన్ స్విచ్ఛాప్ చేసుకుందట...
undefined
దాంతో యువరాజ్ సింగ్‌కి చిర్రెత్తుకొచ్చి, ఆమె ఫోన్‌నెంబర్‌ను డిలీట్ చేసేశాడట. అయితే ఫేస్‌బుక్ ద్వారా మళ్లీ ఈ ఇద్దరికి పరిచయం ఏర్పడింది. యువరాజ్ సింగ్ పంపిన ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్‌ను మూడు నెలల తర్వాత అంగీకరించిన హజల్‌కీచ్, ఆ తర్వాత అతని మాయలో పడిపోయిందట...
undefined
కోలీవుడ్ మూవీ ‘బిల్లా’లో కనిపించిన హజల్‌కీచ్, ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘కిక్’, ‘బాడీగార్డ్’, ‘మాగ్జిమమ్’, ‘హీర్ అండ్ హీరో’ వంటి సినిమాల్లో కనిపించింది. అంతేకాకుండా ‘కామెడీ సర్కస్’, ‘జలక్ థిక్‌ లాజా 6’, ‘బిగ్‌బాస్ 7’ షోలలో కూడా పాల్గొంది హజల్‌కీచ్.
undefined
హజల్‌కీచ్‌కి పెళ్లికి ముందు బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, కిమ్ శర్మ వంటి హీరోయిన్లతో డేటింగ్ చేసిన యువరాజ్ సింగ్ కూడా క్యాన్సర్‌తో పోరాడి జయించిన విషయం తెలిసిందే...
undefined
click me!