నాతో ట్రైనింగ్ అంటే తెలుసుగా.. తాట తీస్తా..నువ్వు సచిన్ కొడుకువని మరిచిపో.. అర్జున్‌తో యువీ తండ్రి

First Published Dec 15, 2022, 12:26 PM IST

టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్  రంజీ  ట్రోఫీలో భాగంగా నిన్న  సెంచరీతో  మెరిశాడు. అచ్చం తన తండ్రి లాగే తాను ఆడిన తొలి రంజీ మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు. 
 

రంజీ ట్రోఫీలో భాగంగా బుధవారం  గోవా-రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో  గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్  సెంచరీతో మెరిశాడు. ఆడిన తొలి  రంజీ మ్యాచ్ లోనే సెంచరీ  చేయడం ద్వారా అర్జున్..  34 ఏళ్ల తర్వాత తండ్రి ఫీట్‌ని రిపీట్ చేశాడు.  సచిన్ కూడా 1988 డిసెంబర్  11న రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు. 

ముంబై జట్టుకు ఆడినప్పుడు పెద్దగా అవకాశాలు లేక   కెరీర్ ముందుకు సాగడం లేదని భావించిన అతడు..   ఇటీవలే గోవాకు మారాడు. గోవాకు మారిన తర్వాత అర్జున్..  టీమిండియా ఆల్ రౌండర్  యువరాజ్ సింగ్  తండ్రి  యోగరాజ్ సింగ్ వద్ధ  ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే.  

తాజాగా అర్జున్ రంజీ మ్యాచ్ లో సెంచరీ చేసిన తర్వాత యోగరాజ్  స్పందించాడు. అర్జున్ సెంచరీ తర్వాత యోగరాజ్ అతడికి మెసేజ్ పెట్టాడు.  ‘చాలా బాగా బ్యాటింగ్ చేశావ్ అర్జున్.  ఒకరోజు నువ్వు దేశం గర్వించదగ్గ ఆల్ రౌండర్ అవుతావు. కావాలంటే నా మాటలను రాసిపెట్టుకో...’ అని మెసేజ్ పెట్టాడట. 

అయితే  యోగరాజ్ దగ్గరికి  అర్జున్ రాక గురించి కూడా  ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.  యోగరాజ్ మాట్లాడుతూ.. ‘‘ముందు యువరాజ్ నా దగ్గరకు వచ్చి  ‘నాన్న మన అర్జున్  రెండు వారాలు చండీగఢ్ లో ఉంటాడు. నువ్వు అర్జున్ కు ట్రైనింగ్ ఇవ్వాలి. సచిన్ నాకు  ప్రత్యేకంగా  రిక్వెస్ట్ చేశాడు..’ అని  అన్నాడు. నేను కాదనలేకపోయా. 

ఎందుకంటే సచిన్ నాకు పెద్ద కొడుకు వంటి వాడు.  కానీ నేను యువీకి ముందే చెప్పా.. నీకు నా ట్రైనింగ్ ఎలా ఉంటుందో ముందే తెలుసు.  నేను ట్రైనింగ్ ఇచ్చేప్పుడు  ఎవరి మాట వినను.  ఆ రెండు వారాలు నన్నెవరూ డిస్ట్రబ్ చేయకూడదు.  మధ్యలో లేని పోని జోక్యం చేసుకుంటే మాత్రం  నేను సహించను.. ట్రైనింగ్ లో నేను చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది అని చెప్పాను. దానికి ఒప్పుకున్నాకే నేను ట్రైనింగ్ స్టార్ట్ చేశా. 

అర్జున్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక్కటే చెప్పా. నువ్వు ఈ రెండు వారాలు సచిన్ టెండూల్కర్ కొడుకువన్న విషయం మరిచిపో. నీ తండ్రి నీడ నుంచి నువ్వు ముందు బయటపడాలి. అలా అయితేనే నీ ట్రైనింగ్ తో పాటు కెరీర్ కూడా సజావుగా సాగుతుంది అన చెప్పాన’ని యోగరాజ్ వివరించాడు. 
 

click me!