మనవాళ్లు ఉండగా ఫారెన్ కోచ్‌ల ఎందుకు దండగ.. వాళ్లు టీమ్‌ను నాశనం చేస్తున్నారు : గౌతం గంభీర్

First Published Nov 27, 2022, 12:21 PM IST

IPL 2023:  భారత మాజీ క్రికెటర్,  ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు మెంటార్ గా వ్యవహరిస్తున్న  గౌతం గంభీర్ మరోసారి  సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ఫారిన్ కోచ్ ల మీద మోజు తగ్గించుకోవాలని  సూచించాడు. 

టీమిండియా 2007, 2011 లలో ప్రపంచకప్ లు నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన   భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్   ఫారెన్  కోచ్ లను లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు సంధించాడు. అసలు వాళ్లు మన జట్లను నాశనం చేయడం తప్ప  ఒరగబెట్టింది ఏమైనా ఉందా..? అని   వ్యాఖ్యానించాడు. గతంలో ఫారెన్ కోచ్ లు భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉండి చేసిన  నష్టాలు గుర్తుచేసుకోవాలని  సూచించాడు. 

ప్రస్తుతం భారత జట్టు ఇక్కడి మాజీ ఆటగాళ్ల వైపే చూస్తుంది తప్ప  ఫారెన్ కోచ్ ల జోలికి వెళ్లడం లేదు. కానీ కోట్లు కుమ్మరించి జరిపిస్తున్న  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం  చాలా జట్లు ఇప్పటికీ ఫారెన్ కోచ్ ల మోజులోనే ఉన్నాయి. వాళ్లకే పెద్దపీట వేస్తున్నాయి.  గంభీర్ తాజాగా వీరినే టార్గెట్ చేశాడు. 

తాజాగా గంభీర్ మాట్లాడుతూ.. ‘అవును. మనకు ఫారెన్ కోచ్ ల అవసరం లేదు. వాళ్లు మన క్రికెట్, జట్టును నాశనం చేస్తారు. ఇండియా లో కోచ్ లు లేరా..? ఇక్కడి వాళ్లను కోచ్ గా నియమిస్తే తప్పేంటి..?  2007లో మేం  (టీమిండియా) లాల్ చంద్ రాజ్‌పుత్   హెడ్ కోచ్ గా ఉన్నప్పుడే   టీ20 ప్రపంచకప్ గెలిచాం.  

ఆ తర్వాత ఆస్ట్రేలియాలో  తొలిసారిగా సీబీ సిరీస్ కూడా నెగ్గాం. అయితే   2011లో  గ్యారీ కిర్స్టెన్ (దక్షిణాఫ్రికా)  భారత్ కు మేలు చేశాడు.  గతంలో డంకెన్ ఫ్లెచర్, జాన్ రైట్ కూడా  టీమిండియాలో యువకులను ప్రోత్సహించి  జట్టుకు మంచి చేసిన విషయాన్ని కూడా మరువరాదు. వాళ్లు లోకల్ ప్లేయర్స్ ను బాగా ఎంకరేజ్ చేశారు. మన టీమ్ లు ఇప్పటికైనా స్థానిక కోచ్ లను నియమించుకోవాలి..’ అని  చెప్పుకొచ్చాడు. 

టీమిండియాకు డంకెన్ ఫ్లెచర్ చివరి ఫారెన్ కోచ్. అతడి తర్వాత  2016లో అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ గా నియమితుడయ్యాడు. కానీ కోహ్లీతో విభేదాల కారణంగా  అతడు ఏడాదికే తప్పుకున్నాడు.  అప్పట్నుంచి రవిశాస్త్రి.. ఐదేండ్ల పాటు హెడ్ కోచ్ గా ఉండగా  గతేడాది నుంచి భారత జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్నాడు. 

ఐపీఎల్ లో  మాత్రం భారత జట్టుకు చెందిన  కోచ్ లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ కు ఆశిష్ నెహ్రా, ఆర్సీబీకి   సంజయ్ బంగర్ లు హెడ్ కోచ్ గా ఉన్నారు.  గత సీజన్ లో  పంజాబ్ కు అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ గా ఉన్నా ఈ సీజన్ నుంచి  ట్రెవర్ బెలిస్  ఆ బాధ్యతలు మోయనున్నాడు.  మిగిలిన అన్ని టీమ్ లకు కూడా ఫారెన్ కోచ్ లే ఉండటం గమనార్హం. 

click me!