పాటలపై పెట్టిన శ్రద్ధ, ఆటపైన పెడితే బాగుపడేవాళ్లం... పాక్ డైరెక్టర్‌పై మాజీ కెప్టెన్ ఫైర్...

First Published | Oct 20, 2023, 7:23 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంది పాకిస్తాన్. అయితే టీమిండియాతో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిన పాకిస్తాన్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ ఫీల్డింగ్‌లో పూర్తిగా తేలిపోయింది..
 


మొదటి 30 ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చిన పాకిస్తాన్ స్టార్ బౌలర్లు, డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు తీయగలిగారు. షాహీన్ ఆఫ్రిదీకి 5 వికెట్లు దక్కగా హారీస్ రౌఫ్ 3 వికెట్లు తీశాడు..

Babar Azam-Micky Arthur

టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, ‘ఇది ఐసీసీ ఈవెంట్‌లో అస్సలు అనిపించడం లేదు. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లా ఉంది. నిజంగా బీసీసీఐ ఈవెంట్‌లానే ఉంది. బాలీవుడ్ పాటలు తప్ప, దిల్ దిల్ పాకిస్తాన్ పాట ఎందుకు వినిపించలేదు..’ అంటూ కామెంట్ చేశాడు..

Latest Videos


ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్.. ‘ఇది నిజంగా మూర్ఖత్వం, నీచం. గ్రౌండ్‌లో పాటల గురించి మాట్లాడడం ఏంటి? దీని గురించి అతనొక్కడే బాధపడుతున్నాడేమో.. 
 

టీమ్ డైరెక్టర్ అనేవాడు ప్లేయర్లను మోటివేట్ చేయాలి. అంతేకానీ మా పాటలు వేయలేదని పిచ్చి పిచ్చి సాకులు చెప్పకూడదు. అర్థం లేని ఆరోపణల వల్ల టీమ్‌కి ఎలాంటి మంచి జరగదు. పాటల మీద పెట్టిన శ్రద్ధ, ఆట మీద పెడితే బాగుంటుంది..
 

వన్డే వరల్డ్ కప్‌లో అంపైరింగ్ మాత్రం స్థాయికి తగ్గట్టుగా లేదు. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో అవుటైన నిర్ణయాలు నాకైతే సంతృప్తిని ఇవ్వలేదు. మహ్మద్ రిజ్వాన్ కూడా ఇలా అవుట్ అయ్యేవాడే, లక్కీగా డీఆర్‌ఎస్ తీసుకున్నాడు..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్.. 

click me!