1. వెంకటేష్ అయ్యర్
2021 నుండి కేకేఆర్ జట్టులో ఉన్న వెంకటేష్ అయ్యర్, 2024లో జట్టుకు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే, ఎవరూ ఊహించని విధంగా 2025 వేలంలో కేకేఆర్ అతన్ని తిరిగి ₹23.75 కోట్లకు జట్టులోకి తీసుకుంది. కానీ, అయ్యర్ దీనికి న్యాయం చేయలేకపోయాడు.
అయ్యర్ ఆ పెట్టుబడికి సరితూగే ప్రదర్శనలు ఇవ్వలేదు. 11 మ్యాచ్‌ల్లో కేవలం 142 పరుగులు మాత్రమే సాధించాడు. 20.29 సగటు, 139.22 స్ట్రైక్‌రేట్ తో అతని బ్యాటింగ్ కొనసాగింది. అంతేకాకుండా, మొత్తం సీజన్‌లో ఒక్క ఓవరూ బౌలింగ్ వేయలేదు.
ఈ కారణాలతో అతన్ని ప్రస్తుత కాంట్రాక్ట్ విలువతో కొనసాగించే అవకాశం తక్కువ. అయితే, కేకేఆర్ మినీ వేలంలో తక్కువ ధరకు అతన్ని తిరిగి తీసుకునే అవకాశం ఉంది.