తుఫాను కంటే ఎక్కువ‌ వేగం.. అత‌నంటే ఆట‌గాళ్ల‌కు హ‌డ‌ల్.. ఎవ‌రీ డేంజరస్ బౌలర్?

First Published | Aug 12, 2024, 3:11 PM IST

 Fastest Bowler in the World: ఈ ఫాస్ట్ బౌలర్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడు. వేగవంతమైన పేస్ బౌలింగ్, దూకుడు శైలితో క్రికెట్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సాధించాడు. అత‌ని బౌలింగ్ అంటే బ్యాట‌ర్ల‌కు హ‌డ‌ల్.. ! 

Shaun Tait

Fastest Bowler in the World: ప్రపంచ క్రికెట్‌లో చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వారి బౌలింగ్ కు బ్యాటర్స్ అనేక షాక్ లు తిన్న సంద‌ర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఒక బౌల‌ర్ అంటే ఆగ‌టాళ్ల‌కు హ‌డ‌ల్. ప్రపంచంలోని చాలా మంది బ్యాట్స్‌మెన్ అత‌ని బౌలింగ్ కు భ‌య‌ప‌డిపోయారు. ఎందుకంటే అత‌ని బౌలింగ్ లో వ‌చ్చే బంతులు గంటకు 100 మైళ్ల వేగంతో దూసుకొస్తాయి.  

ప్రపంచ క్రికెట్ లో టాప్ ఫాస్ట్ బౌలర్ల జాబితాను గ‌మ‌నిస్తే గంటకు 100 మైళ్ల వేగంతో బంతిని విసిరిన బౌలర్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు. అంటే గంటకు 161 కిలో మీట‌ర్ల వేగంతో వ‌స్తాయి. వీరిలో పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ అక్తర్, ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్ లీ, షాన్ టైట్ ఉన్నారు. ఇప్పుడు వీరు క్రికెట్ కు వీడ్కోలు ప‌లికారు. వీరిలో షాన్ టైట్ బ్యాట‌ర్ల‌ను ఎలా త‌న బంతుల‌తో భ‌య‌పెట్టాడో చూద్దాం.. 


ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ షాన్‌ టైట్ బౌలింగ్ అంటే బ్యాట‌ర్లు ఎప్పుడూ భ‌య‌ప‌డేవారు. 2010లో ఇంగ్లండ్‌పై గంటకు 161.1 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరినీ షాక్ కు గురిచేశాడు. ఆడిన‌వి కొన్ని మ్యాచ్ లే అయినా చ‌రిత్ర‌లో నిలిచిపోయే బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. తరచుగా గాయాల కారణంగా అంతర్జాతీయ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. మొత్తంగా 3 టెస్టులు, 35 వ‌న్డేలు, 21 టీ20 మ్యాచ్‌లు ఆడి వరుసగా 5, 62,  28 వికెట్లు తీశాడు.

2005లో టెస్టు క్రికెట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన షాన్ టైట్ 2007లో వన్డే, టీ20 ఫార్మాట్లలో కూడా తన ప్రతిభను కనబరిచాడు. దాదాపు ఒక దశాబ్దం పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అతను 2017లో గాయాల కారణంగా క్రికెట్‌కు రిటైరయ్యాడు. మోచేయి గాయం అతని కెరీర్‌ను దెబ్బ‌తీసింది. 

షాన్ టైట్ వేసిన బంతుల వేగం చాలా ఎక్కువ‌గా ఉండడంతో అత‌ని బౌలింగ్ ను ఆడేందుకు బ్యాట్స్‌మెన్ భయపడేవారు. అత‌ను బౌలింగ్ లోకి వ‌స్తున్నాడంటే దేవుని మీద భారం వేసే ఆట‌గాళ్లు చాలా మందే ఉన్నారు. క్రికెట్ కు వీడ్కోలు ప‌లికిన త‌ర్వాత కోచ్‌గా మారాడు. ప‌లు లీగ్ జ‌ట్ల‌తో పాటు పాకిస్తాన్ వంటి క్రికెట్ జట్లకు సేవలందించాడు. 

Latest Videos

click me!