ముషీర్ ఖాన్: దులీప్ ట్రోఫీలో త‌మ్ముడి సెంచ‌రీ.. అన్న సంబ‌రం

First Published Sep 5, 2024, 10:41 PM IST

Duleep Trophy -Musheer Khan: అద్భుత‌మైన బ్యాటింగ్ తో స‌ర్ఫరాజ్ ఖాన్ సోద‌రుడు ముషీర్ ఖాన్ మూడో ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించాడు. ఇండియా-బీ, ఇండియా-ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీలో తొలి సెంచరీ సాధించాడు.
 

Musheer Khan, Sarfaraz Khan, duleep trophy 2024

Duleep Trophy -Musheer Khan: ప్ర‌తిష్టాత్మ‌క దేశ‌వాళీ క్రికెట్ ట్రోర్న‌మెంట్ దులీప్ ట్రోఫీ గురువారం ఘ‌నంగా ప్రారంభం అయింది. ఈ టోర్నీలో మొత్తం నాలుగు జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. బీసీసీఐ ఇండియా ఏ, ఇండియా బీ, ఇండియా సీ, ఇండియా డీ గా నాలుగు జ‌ట్లుగా ప్లేయ‌ర్ల‌ను విభ‌జించి దులీప్ ట్రోఫీని నిర్వ‌హిస్తోంది. 

గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇండియా-బీ, ఇండియా-ఏ జట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో అద్భుత‌మైన ఆట‌తో అద‌ర‌గొట్టాడు ముషీర్ ఖాన్. ఈ మ్యాచ్ లో ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీలో త‌న తొలి సెంచ‌రీని సాధించాడు. మొత్తంగా  తనకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మూడో సెంచ‌రీ. 

Musheer Khan

దులీప్ ట్రోఫీలో ఆడుతున్న అండర్-19 క్రికెటర్ ముషీర్ ఖాన్ సెంచరీ సాధించాడు. వచ్చే ఐదు నెలల్లో భారత జట్టు 10 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ముఖ్యంగా మరో రెండు నెలల్లో స్వదేశంలో 5 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో భార‌త క్రికెట‌ర్ల‌కు దులీప్ ట్రోఫీ చాలా కీలకం.

ఎందుకంటే దులీప్ ట్రోఫీలో మంచి ప్ర‌ద‌ర్శ‌న చేసిన ప్లేయ‌ర్ల‌ను భార‌త టెస్టులో జ‌ట్టులోకి తీసుకోవాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించుకుంది. దీంతో చాలా మంది ప్లేయ‌ర్లు మంచి ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు. సర్బరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ ఇండియా బీ జట్టులో ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉన్నారు. 

Latest Videos


Musheer Khan Batting

సర్బరాజ్ ఖాన్ ఇప్పటికే భారత జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి అభిమానుల ఆదరణ పొందాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు.  

అయితే బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌కి భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే సర్బరా ఖాన్ దులీప్ ట్రోఫీ చాలా కీల‌కం. దీంతో ఫ‌స్ట్ మ్యాచ్‌లో అతడు ఎలా ఆడబోతున్నాడోనని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది.సర్ఫ‌రాజ్ ఖాన్ ను అవేస్ ఖాన్ సూప‌ర్ బౌలింగ్ తో ఎల్బీడబ్ల్యూ చేశాడు. 35 బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు.

Musheer Khan-Sachin Tendulkar

అలాగే, యాక్షన్ ప్లేయర్ రిషబ్ పంత్ కూడా పది బంతులు ఎదుర్కొని కేవలం 7 పరుగులకే పెవిలియ‌న్ చేరుకుని నిరాశ‌ప‌రిచాడు. కానీ, స‌ర్ఫ‌రాజ్ ఖాన్ త‌మ్ముడు, అండర్-19 క్రికెటర్ ముషీర్ ఖాన్ ఒకవైపు వికెట్లు పడినప్పటికీ అద్భుతంగా ఆడుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. 

టెస్ట్ క్రికెట్ జ‌ట్టులోకి రావాలంటే త‌మ మొత్తం శ‌క్తిని, నైఫుణ్యాల‌ను ప్ర‌ద‌ర్శించాల్సి ఉంటుంది. అలాంటి ఆట‌తో సెంచ‌రీ కొట్టాడు ముషీర్ ఖాన్. 227 బంతుల్లో 105 పరుగులతో వికెట్లు ప‌డుతున్న స‌మ‌యంలో సెంచ‌రీతో జ‌ట్టును మ‌రింత క‌ష్టాల్లో ప‌డ‌కుండా ఆపాడు. త‌న ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. 

Musheer Khan

ముషీర్ ఖాన్ సెంచరీ సాధించినప్పుడు ఇండియా బీ ఆటగాళ్లందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. అయితే సర్బరాజ్ ఖాన్ మాత్రమే ముషీర్ ఖాన్ సెంచరీని జరుపుకోవడానికి ఒక అడుగు ముందుకేశాడు. ఎంతో సంతోషంతో ఎగిరిగంతేస్తున్న సంబ‌రాలు చేసుకున్న వీడియో దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

అత‌ని సెంచ‌రీ స‌మ‌యానికి ఇండియా బీ జ‌ట్టు 79 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఖలీల్‌ అహ్మద్‌, ఆకాశ్‌దీప్‌, అవేశ్‌ ఖాన్‌ తలో రెండు వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ 14 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా 50 పరుగులు ఇచ్చాడు. 

click me!