ఉమ్రాన్ మాలిక్ పై కేన్ మామ ప్రశంసలు.. అదే అతడి ఆస్తి అంటూ..

Published : Nov 16, 2022, 06:21 PM IST

India Tour Of New Zealand: గడిచిన రెండు ఐపీఎల్ సీజన్లలో టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తో కలిసి ఆడిన  సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ ప్రశంసలు కురిపించాడు.  

PREV
16
ఉమ్రాన్ మాలిక్ పై కేన్ మామ ప్రశంసలు.. అదే అతడి ఆస్తి అంటూ..

సన్ రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్, జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ పై  న్యూజిలాండ్ సారథి  కేన్ విలియమ్సన్  ప్రశంసలు కురిపించాడు. ఉమ్రాన్ కు తన  వేగమే బలమని.. అతడు సుదీర్ఘకాలం భారత జట్టులో కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

26

ఇండియా - న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభానికి ముందు  కేన్ మామ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఉమ్రాన్ మాలిక్ లో అత్యద్భుత టాలెంట్ ఉంది. గతేడాది ఐపీఎల్ లో భాగంగా  అతడితో కలిసి ఆడాను.  అతడి వేగమే జట్టుకు ఆస్తి. అంతర్జాతీయ స్థాయిలో ఉమ్రాన్ ను చూడటం గర్వంగా ఉంది. 

36

ఇది అతడి  గ్రోత్ ను చూపిస్తున్నది.  గంటకు 150 కిలోమీటర్ల వేగంతో  బంతులు విసరడం అతడికున్న బలం.  భారత జట్టులోకి అతడు వచ్చాడంటే ఉమ్రాన్ రానున్న రోజుల్లో సుదీర్ఘకాలం పాటు భారత జట్టు తరఫున ఆడతాడని నేను ఆశిస్తున్నా. ఇటువంటి పర్యటనలకు రావడం అతడికి ఉపకరిస్తుంది. కానీ వాస్తవం చెప్పాలంటే  ఉమ్రాన్  చాలా టాలెంటెడ్ బౌలర్..’ అని తెలిపాడు.

46

ఐపీఎల్ లో 2021 సీజన్ లో పలు మ్యాచ్ లు ఆడాడు ఉమ్రాన్ మాలిక్. కేన్ మామ సారథ్యంలోనే ఉమ్రాన్.. సన్ రైజర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినా గంటకు 150 కిలోమీటర్ల  వేగంతో బంతులు విసిరి  అందరి దృష్టిని ఆకర్షించాడు. 

56

ఇక  2022 సీజన్ లో ఉమ్రాన్ మాలిక్.. 14 మ్యాచ్ లు ఆడి 22 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్.. ఈ ఏడాది భారత జట్టు తరఫున కూడా అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్  సిరీస్ లో  ఉమ్రాన్ భారత జట్టు తరఫున ఆడాడు. 

66

ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన ఉమ్రాన్.. 2 వికెట్లే తీసినా  తన వేగంతో  అందరినీ అబ్బురపరించాడు. తాజాగా న్యూజిలాండ్ సిరీస్ తో కూడా అతడు ఎంపికవడంతో  వచ్చే టీ20 ప్రపంచకప్ లో కొత్త రక్తాన్ని ఎక్కించాలని చూస్తున్న బీసీసీఐ..  ఈ సిరీస్ నుంచే ఆ పనులు మొదలుపెట్టిందని    విశ్లేషకుల వాదిస్తున్నారు. 

click me!

Recommended Stories