ఇదే ఆఖరి సీజన్ అని తేల్చేసిన ఎంఎస్ ధోనీ... సీఎస్‌కే తర్వాతి కెప్టెన్ ఎవరు?...

First Published Nov 16, 2022, 5:23 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీస్ నిష్కమణ తర్వాత ఐపీఎల్ సందడి మొదలైపోయింది. భారత జట్టు ఓటమి నుంచి అభిమానులను దృష్టి మళ్లించేలా ఐపీఎల్‌ రిటెన్షన్‌కి సంబంధించిన వార్తలను విడుదల చేస్తోంది బీసీసీఐ. ఇప్పటికే 10 ఫ్రాంఛైజీల రిటైన్ ప్లేయర్ల లిస్టు, వేలంలో పాల్గొనబోయే ప్లేయర్ల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...

jadeja

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ఫెయిల్యూర్‌ని మరిచిపోయిన అభిమానులు, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ప్లేయర్ల గురించి, వేలానికి వదిలేసిన ఆటగాళ్ల గురించి మాట్లాడుకోవడం మొదలెట్టేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తర్వాత అంతగా హాట్ డిస్కర్షన్‌లో నిలిచిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్...

ఐపీఎల్ 2020 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన చెన్నై సూపర్ కింగ్స్, ఏడో స్థానంలో నిలిచింది. అయితే ఆ తర్వాతి సీజన్‌లోనే అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చి నాలుగో సారి టైటిల్ గెలిచింది. 2022 సీజన్‌లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్‌లో నాటకీయ పరిణామాలు జరిగాయి...
 

jadeja

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో రవీంద్ర జడేజాని కెప్టెన్‌గా ప్రకటించింది సీఎస్‌కే. ఎన్నో అంచనాలు, మరెన్నో ఆశలతో ఐపీఎల్ 2022 సీజన్‌ని ఆరంభించిన జడేజాకి ఆశించిన ఫలితాలు రాలేదు.

వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, మొదటి 8 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకోగలిగింది. దీపక్ చాహార్ గాయం కారణంగా తప్పుకోవడం, శార్దూల్ ఠాకూర్ వేరే టీమ్‌కి వెళ్లిపోవడం, సామ్ కుర్రాన్ ఐపీఎల్ ఆడకపోవడం వంటివి చెన్నైని దెబ్బ తీశాయి. వరుస ఓటముల ఎఫెక్ట్‌తో జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు... తిరిగి ఎంఎస్ ధోనీ ఆ బాధ్యతలు అందుకున్నాడు.

కెప్టెన్సీ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్‌కీ, రవీంద్ర జడేజాకీ మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి. దీంతో జడేజా, సీఎస్‌కే టీమ్ నుంచి వెళ్లిపోతున్నాడని తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు టీమ్ మేనేజ్‌మెంట్‌కీ, జడ్డూ మధ్య విభేదాలు తొలిగిపోయి, కలిసిపోయారు...

అంతా బాగానే ఉన్నా, ఐపీఎల్ 2023 సీజన్ తనకి ఆఖరి సీజన్ అంటూ మహేంద్ర సింగ్ ధోనీ ప్రకటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో 2024 సీజన్‌ నుంచి కొత్త కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్‌ని నడిపించాల్సి ఉంటుంది. 2022 అనుభవాలతో జడేజా, ఆ ప్లేస్‌ని తీసుకునే అవకాశం లేదు...

‘టీమ్‌లో ధోనీ ఉన్నంతవరకూ వేరే కెప్టెన్‌కి ప్లేస్ లేదు, గత సీజన్‌లోనే ఈ విషయం అందరికీ క్లియర్‌గా అర్థమై ఉంటుంది. ఇంతకుముందు అడిగితే ధోనీ తర్వాత కేన్ విలియంసన్‌కి సీఎస్‌కే కెప్టెన్సీ దక్కితే బాగుంటుందని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదు...

ధోనీ తర్వాత కొన్నేళ్ల పాటు టీమ్‌ని నడిపించే నాయకుడు కావాలి. కనీసం 5-6 ఏళ్లు ఆ బాధ్యతను మోయగలగాలి. కేన్ విలియంసన్‌ ఆ పని చేయలేడు. సీఎస్‌కే కొత్త కెప్టెన్‌ని తయారుచేసే పనిలో పడిందనే అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా.. 

click me!