అనిల్ కుంబ్లే, ఎమ్మెస్ ధోనీ టెస్టుల నుంచి తప్పుకున్న తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్సీ తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. టెస్టుల్లో 7వ స్థానంలో ఉన్న భారత జట్టును వరుసగా ఆరేళ్ల పాటు టాప్ టీమ్‌గా నిలబెట్టాడు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతోనే భారత జట్టు ఆధిపత్యం కూడా ముగిసిపోయినట్టే కనిపిస్తోంది..
సౌతాఫ్రికా టూర్‌లో సెంచూరియన్ టెస్టు విజయం తర్వాత రెండో టెస్టులో ఆడని విరాట్ కోహ్లీ, కేప్‌టౌన్ టెస్టు పరాజయం తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దూకుడు, అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో టీమిండియాకి విజయాలు తెచ్చిపెట్టిన కోహ్లీ తప్పుకోవడంతో ఆ స్థానంలో రోహిత్ శర్మ, మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు...
27
అయితే గాయం కారణంగా సౌతాఫ్రికా టూర్‌కి దూరమైన రోహిత్ శర్మ, ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకి ముందు కరోనా బారిన పడ్డాడు. రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఎలాంటి సీక్రెట్స్ అవసరం లేదు. మనోడు మ్యాగ్జిమమ్ ఫారిన్ టూర్స్‌కి ముందు కచ్ఛితంగా గాయపడతాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ బాగా వినిపిస్తాయి...
37
రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాక భారత జట్టు ఏకంగా ఐదుగురు కెప్టెన్లను మార్చాల్సి వచ్చింది. కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా... టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించారు. ఏ మాత్రం కెప్టెన్సీ అనుభవం లేని బుమ్రా, ఓ రకంగా భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. అయితే విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు...
47
రోహిత్ శర్మ వరుసగా గాయపడుతూ ఉండడంతో భారత జట్టుకి ఓ రెగ్యూలర్ కెప్టెన్ అవసరం బాగా ఉంది. టీ20, వన్డేల్లో వరుసగా కెప్టెన్లను మార్చినా పర్వాలేదు కానీ టెస్టుల్లో మాత్రం జట్టును సుదీర్ఘ కాలం నడిపించే సారథిని వెతకాల్సిన అవసరం ఎంతో ఉంది...
57
Image credit: Getty
కనీసం ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమ్‌ని నడిపించిన జస్ప్రిత్ బుమ్రాకి అయినా టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే బెటర్... అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. లేదంటే ఐదో టెస్టులో దక్కిన పరాజయం కేవలం శాంపిల్ మాత్రమేనని... కెప్టెన్లను మారుస్తూ పోతే భారత జట్టు మున్ముందు ఇలాంటి పరాజయాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...
67
విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత విజయాలు అందుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌ని అత్యంత పటిష్టంగా మార్చడానికి కొన్నేళ్ల సమయం పట్టింది.
77
Image Credit: Getty Images
ఇప్పుడు అదే ఫాస్ట్ బౌలింగ్ యూనిట్, విదేశాల్లో 20 వికెట్లు తీయలేకపోతున్నాడంటే దానికి సరైన కెప్టెన్ పూర్తి స్థాయి లేకపోవడమే కారణమంటున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్... ప్రతీ సిరీస్ ఆరంభానికి ముందు కొత్త కెప్టెన్ కోసం వెతుక్కోకుండా రోహిత్ శర్మ స్థానంలో ఓ స్థిరమైన టెస్టు సారథిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.