మాకు ఇండియాలో దక్కే గౌరవం, పాక్‌లో దొరకదు... - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీ...

First Published Dec 1, 2022, 4:27 PM IST

2005 తర్వాత మొట్టమొదటిసారిగా పాకిస్తాన్‌లో పర్యటిస్తోంది ఇంగ్లాండ్ జట్టు. రావల్పిండిలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కి ముందు పాక్‌లో వరద బాధితుల సహాయార్థం తన మ్యాచు ఫీజుని విరాళం ఇస్తున్నట్టు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రకటించాడు. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశాడు పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ...

Shahid Afridi-Sachin Tendulkar

‘ఇండియాకి 2011 వన్డే వరల్డ్ కప్ కోసం వెళ్లాం. అప్పుడు నేనే పాక్ టీమ్‌కి కెప్టెన్‌ని. నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నా... పాక్ టీమ్ అంటే ఇండియాలో చాలా చులకనగా చూస్తారని, శత్రువుల్లా భావిస్తారని అంతా అనుకుంటారు. అది నిజం కాదు... నిజానికి మాకు ఇండియాలో దక్కే గౌరవం, పాక్‌లో కూడా దక్కదు...

ఆ టైమ్‌లో ఇండియాలో చాలా ఎంజాయ్ చేశాం.ఎన్నో మధురమైన అనుభవాలను మూటకట్టుకుని ఇండియాకి తిరిగి వచ్చింది. ఇప్పుడు వరల్డ్ కప్ కోసం ఇండియాకి వెళ్లాలా? వద్దా? అనే చర్చ నడుస్తోంది.

వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో ప్రపంచమంతా మనల్ని చూస్తోంది. కాబట్టి మన దేశ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంటుంది...  బెన్ స్టోక్స్ చేసిన సాయం మరువలేనది. అతను ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఇలాంటివి జరిగితే ప్రత్యర్థి క్రికెటర్లపై కూడా గౌరవం పెరుగుతుంది.

అంతర్జాతీయ క్రికెటర్లు ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లను కూడా షేర్ చేసుకుంటున్నారు. మా రోజుల్లో అలా ఉండేది కాదు...’ అంటూ చెప్పుకొచ్చాడు పాక్ మాజీ కెప్టెన్, మాజీ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీ...

India vs Pakistan Last Over

ఆసియా కప్ 2023 టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే కొన్నేళ్లుగా ఇరుదేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో పాక్‌లో పర్యటించడం టీమిండియాకి క్షేమం కాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొడుకు, బీసీసీఐ అధ్యక్షుడు జై షా కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశాడు...

తాత్కాలిక వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పాక్‌లో ఆసియా కప్ జరగకపోయినా, పాకిస్తాన్‌కి ఇండియా రాకపోయినా తాము 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆడడం జరగదంటూ పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. దీంతో ఆసియా కప్ 2023 టోర్నీ సమయంలో ఏం జరుగుతుందనే ఇప్పటి నుంచి అభిమానుల్లో ఆసక్తి రేకేతెత్తిస్తోంది...

click me!