విరాట్ కోహ్లీయే అబద్ధం చెప్పాడు, గంగూలీ కాదు... బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కామెంట్స్...

First Published Jan 1, 2022, 10:51 AM IST

వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి సరైన క్లారిటీ లేకుండానే అతన్ని సౌతాఫ్రికా సిరీస్‌కి టెస్టు వైస్ కెప్టెన్‌గా, వన్డే సారథిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సెలక్టర్లు...

రోహిత్ శర్మ గాయం కారణంగా మొదట టెస్టు సిరీస్‌కి దూరం కావడంతో అతని స్థానంలో కెఎల్ రాహుల్‌కి టెస్టు వైస్ కెప్టెన్సీ దక్కింది...

రోహిత్ శర్మ గాయంపై క్లారిటీ రాకపోవడంతో వన్డే సిరీస్‌కి కూడా కెఎల్ రాహుల్‌కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన బీసీసీఐ, జస్ప్రిత్ బుమ్రాని వైస్ కెప్టెన్‌గా ఎంచుకుంది...

విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని తానే స్వయంగా కోరానని, అయితే అతను వినిపించుకోలేదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే...

ఈ వ్యాఖ్యలను ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో కొట్టి పారేశాడు విరాట్ కోహ్లీ. తాను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించినప్పుడు బీసీసీఐలో ఎవ్వరూ అడ్డుచెప్పలేదని స్పష్టం చేశాడు...

దీంతో విరాట్ కోహ్లీ అబద్ధం చెప్పాడా? లేక బీసీసీఐ అధ్యక్షుడు అబద్ధం చెప్పాడా? అనే విషయమే సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది... తాజాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ దీనిపై కామెంట్లు చేశాడు...

‘టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ చేసిన కామెంట్లు చేసి, అందరం షాక్ అయ్యాం. మీటింగ్ మొదలయ్యేవరకూ మాకు ఈ విషయం గురించి తెలీదు...

టీ20 వరల్డ్ కప్ టోర్నీ ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పాం. కావాలంటే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత దీని గురించి మాట్లాడదామని చెప్పాం...

భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టీ20 కెప్టెన్‌గానూ కొనసాగాలని కోరాం. సెలక్టర్లు అందరూ, విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం వరల్డ్ కప్ ప్రదర్శనపై ఎఫెక్ట్ చూపిస్తుందని భావించారు...

గంగూలీతో పాటు బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ మీటింగ్‌లో బీసీసీఐ అధికారులందరూ పాల్గొన్నారు. అందరూ కోహ్లీకి ఈ మాటే చెప్పారు...

కానీ విరాట్ కోహ్లీ, ఎవ్వరూ తనని అడ్డుకోలేదని చెప్పినప్పుడు షాక్ అయ్యాం. కెప్టెన్‌గా తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదు, అయితే ఆ నిర్ణయం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపించకూడదు...

విరాట్ కోహ్లీ, జట్టుకి పిల్లర్‌లాంటి వాడు. అతని నిర్ణయాన్ని మేం గౌరవించాం. కానీ అతన్ని టీ20 కెప్టెన్సీ నుంచి ప్రతీ ఒక్కరం కోరామనేది మాత్రం నిజం...’ అంటూ చెప్పుకొచ్చాడు చేతన్ శర్మ.

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కామెంట్లతో మరోసారి బీసీసీఐ వర్సెస్ విరాట్ కోహ్లీ విషయం గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది...

click me!