రోహిత్ శర్మ, రిషబ్ పంత్, అశ్విన్, అక్షర్ పటేల్... క్రికెట్ ఆస్ట్రేలియా 2021 టెస్టు టీమ్‌ ఎలెవన్‌లో...

First Published Dec 31, 2021, 12:55 PM IST

క్రికెట్ ఆస్ట్రేలియా, 2021 ఏడాదికి బెస్ట్ టెస్టు టీమ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఇందులో నలుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కగా, ఒకే ఒక్క ఆసీస్ ప్లేయర్‌కి చోటు సంపాదించుకోవడం విశేషం. 

ఈ ఏడాది టెస్టుల్లో రెండు భారీ సెంచరీలతో పాటు 900+ పరుగులు చేసిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ, క్రికెట్ ఆస్ట్రేలియా టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2021లో చోటు దక్కింది... 

శ్రీలంక టెస్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే, ఈ ఏడాది నాలుగు సెంచరీలతో 900+ పరుగులు చేసి, ఆస్ట్రేలియా టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయయర్ 2021లో ఓపెనర్‌గా ఎంపికయ్యాడు...

మార్నస్ లబుషేన్... ఈ ఏడాది టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో నెం.1 ర్యాంకును కైవసం చేసుకున్న ఆసీస్ యంగ్ బ్యాట్స్‌మెన్‌కి ఆసీస్ బెస్ట్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో చోటు దక్కింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్న ఏకైన ఆసీస్ ప్లేయర్ లబుషేన్...

ఈ ఏడాది టెస్టుల్లో 1700+ పరుగులు సాధించి, రికార్డు క్రియేట్ చేసిన ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్, క్రికెట్ ఆస్ట్రేలియా టెస్టు ప్లేయింగ్ ఎలెవన్ ఆఫ్ ది ఇయర్ 2021లో టూ డౌన్ బ్యాట్స్‌మెన్‌గా చోటు దక్కించుకున్నాడు...

ఈ ఏడాది 13 ఇన్నింగ్స్‌ల్లో 57.10 సగటుతో 571 టెస్టు పరుగులు చేసిన పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఫవాద్ అలామ్‌కి క్రికెట్ ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌ 2021లో చోటు దక్కింది...

రిషబ్ పంత్... ఈ ఏడాది టెస్టుల్లో కమ్‌బ్యాక్ ఇచ్చి గబ్బా టెస్టులో భారత జట్టుకి చారిత్రక విజయాన్ని అందించిన భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్... ఆస్ట్రేలియా టెస్టు బెస్ట్ టీమ్‌లో వికెట్ కీపర్‌గా చోటు దక్కించుకున్నాడు...

కేల్ జెమ్మీసన్... న్యూజిలాండ్ జట్టు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచేందుకు కారణమైన కివీస్ ఫాస్ట్ బౌలర్ కేల్ జెమ్మీసన్‌కి కూడా ఆసీస్ బెస్ట్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2021లో చోటు దక్కింది...

రవిచంద్రన్ అశ్విన్... ఈ ఏడాది టెస్టుల్లో 54 వికెట్లు తీయడమే కాకుండా ఓ సెంచరీతో రాణించిన భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించుకున్నాడు.

అక్షర్ పటేల్... ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా ఆరంగ్రేటం చేసి, నాలుగు టెస్టుల్లో ఐదుసార్లు ఐదేసి వికెట్లు తీసిన భారత యంగ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌ 2021లో చోటు దక్కించుకున్నాడు...

హసన్ ఆలీ... ఈ ఏడాది పాకిస్తాన్ తరుపున 39 టెస్టు వికెట్లు తీసిన సీనియర్ పేసర్ హసన్ ఆలీ, ఆస్ట్రేలియా 2021 బెస్ట్ టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు...

షాహీన్ ఆఫ్రిదీ... ఈ ఏడాది 44 టెస్టు వికెట్లు తీసి, రవిచంద్రన్ అశ్విన్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న పాక్ యంగ్ సెన్సేషన్ షాహీన్ ఆఫ్రిదీకి ఆసీస్ టెస్టు టీమ్‌లో ప్లేస్ దక్కింది...

క్రికెట్ ఆస్ట్రేలియా టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2021: రోహిత్ శర్మ, దిముత్ కరుణరత్నే, మార్నస్ లబుషేన్, జో రూట్, ఫవాద్ ఆలం, రిషబ్ పంత్, కేల్ జెమ్మీసన్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, హసన్ ఆలీ, షాహీన్ ఆఫ్రిదీ

click me!