ఐసీసీ అవార్డులు 2021: టీమిండియా నుంచి రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే, వుమెన్స్ టీమ్ నుంచి స్మృతి మంధాన...

First Published Dec 31, 2021, 4:18 PM IST

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతీ ఏటా అందించే అవార్డులకు నామినేషన్లను ప్రకటించింది. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో పర్ఫామెన్స్ ఆధారంగా వేర్వేరుగా, ఓవరాల్‌గా అన్నింట్లో కలిపి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌కి నామినీలను ప్రకటించింది ఐసీసీ...

ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ రేసులో పాక్ ప్లేయర్లు షాహీన్ ఆఫ్రిదీ, మహ్మద్ రిజ్వాన్ నిలిచారు...

వీరితో పాటు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ కూడా ‘ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు రేసులో నిలిచారు...

ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 రచెల్ హోహోయ్ ఫ్లింట్ ట్రోఫీ రేసులో టమ్మీ బేమంట్, లిజెల్లీ లీ, గాబీ లూయిస్‌తో పాటు భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన రేసులో నిలిచింది...

ఐసీసీ మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో ఈ ఏడాది 1700+ పరుగులు చేసిన జో రూట్, న్యూజిలాండ్ యంగ్ పేసర్ కేల్ జెమ్మీసన్, శ్రీలంక టెస్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే, రవిచంద్రన్ అశ్విన్ నిలిచారు...

ఈ ఏడాది 54 టెస్టు వికెట్లతో పాటు ఓ సెంచరీతో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్, టీమిండియా నుంచి ఐసీసీ అవార్డుల రేసులో నిలిచిన ఒకే ఒక్కడు...

ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 రేసులో బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, సౌతాఫ్రికా ప్లేయర్ జానేమన్ మలాన్, ఐర్లాండ్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ నిలిచారు...

ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 రేసులో టమ్మీ బేమంట్, లిజెల్లీ లీ, హేలీ మాథ్యూస్, ఫాతిమా సనా పోటీలో ఉన్నారు...

ఐసీసీ మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2021 రేసులో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్, శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగ, ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, పాక్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ నిలిచారు..

ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు కోసం టమ్మీ బేమంట్. గాబీ లూయిస్, నాట్ సివర్‌తో పాటు స్మృతి మంధాన పోటీలో ఉంది...

ఐసీసీ మెన్స్ అవార్డులను జనవరి 24, 2022న, వుమెన్స్ అవార్డులను 23, జనవరి 2022న ప్రకటించబోతున్నారు. వీటితో పాటు స్పిరిట్ ఆఫ్ క్రికెటర్, అంపైర్స్ అవార్డులను కూడా కూడా ప్రకటించనుంది ఐసీసీ.

click me!