ధోనీ తప్పుకున్నాక, మేమిద్దం కలిసి ఆడనే లేదు, అదే నా పర్ఫామెన్స్‌ను దెబ్బతీసింది... - కుల్దీప్ యాదవ్..

First Published May 16, 2021, 12:03 PM IST

ఒకప్పుడు మణికట్టు మ్యాజిక్‌తో అదరగొట్టిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఇప్పుడు తుదిజట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్‌తో పాటు భారత జట్టులో అతను ఎక్కువగా రిజర్వు బెంచ్‌కే పరిమితమవుతున్నాడు.

ఒకప్పుడు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ జోడి టీమిండియాకి మొదటి స్పిన్ ఛాయిస్‌గా ఉండేవాళ్లు. ఇద్దరూ కూడా అద్భుతంగా రాణిస్తూ, వికెట్లు తీస్తుండడంతో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్.. కేవల టెస్టులకు మాత్రమే పరిమితమయ్యేవాళ్లు. ఈ జోడిని ‘కుల్ చా’ అని కూడా పిలిచేవాళ్లు.
undefined
అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. యజ్వేంద్ర చాహాల్ వన్డే, టీ20ల్లో ఇప్పటికీ భారత జట్టులో చోటు దక్కించుకుంటుంటే... కుల్దీప్ యాదవ్ మాత్రం డ్రింక్స్ మోస్తూ, డగౌట్‌తో కూర్చుంటూ కాలం గడిపేస్తున్నాడు...
undefined
విదేశీ పిచ్‌లపై మంచి రికార్డు ఉన్నప్పటికీ కుల్దీప్ యాదవ్‌ని న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి, ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కి ఎంపిక చేయలేదు సెలక్టర్లు...
undefined
‘కొన్నిసార్లు ధోనీ గైడెన్స్ లేకపోవడం వల్లే నేను వికెట్లు తీయలేకపోతున్నానేమో అనిపిస్తూ ఉంటుంది. మాహీకి ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవం ఉపయోగించి, ఎలా బౌలింగ్ చేయాలో వికెట్ల వెనకాల నుంచి అరుస్తూ చెప్పేవాడు మాహీ భాయ్...
undefined
మేం అతని అనుభవాన్ని మిస్ అవుతున్నాం... రిషబ్ పంత్ కూడా వికెట్ల వెనకాల నుంచి సలహాలు ఇస్తూ ఉంటాడు. కానీ పంత్‌కి, మాహీ అంత అనుభవం లేదు. మాహీలా మేం తప్పుచేస్తే, మందలిస్తూ దారిలో పెట్టేంత వయసూ లేదు...
undefined
ప్రతీ స్పిన్నర్‌కీ అవతలి ఎండ్‌నుంచి సలహాలు ఇచ్చే మాహీ లాంటి ఓ పార్టనర్‌ కావాలి... మాహీ భాయ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు, నేను, చాహాల్ అద్భుతంగా ఆడేవాళ్లం...
undefined
మాహీ భాయ్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చాహాల్, నేను కలిసి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మాహీ రిటైర్మెంట్ తర్వాత నేను ఆడిన మ్యాచులు వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు...
undefined
ఈ రెండేళ్లలో నేను మహా అయితే 10 మ్యాచులు ఆడి ఉంటానంతే. అందులో ఓ మ్యాచ్‌లో హ్యాట్రిక్ కూడా తీశాను. ఓవరాల్‌ పర్ఫామెన్స్‌ చూస్తే చాలా బాగున్నట్టే అనపిస్తుంది.
undefined
అయితే చాలా మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం కావడం వల్ల నా పర్ఫామెన్స్‌పై ఎఫెక్ట్ పడింది. స్పిన్‌కి అనుకూలించే చెన్నైలాంటి పిచ్‌ల్లో కూడా నాకు ఆడే అవకాశం ఇవ్వలేదు...’ అంటూ కామెంట్ చేశాడు కుల్దీప్ యాదవ్.
undefined
click me!