మహిళా క్రికెటర్ల పట్ల ఇంత నిర్లక్ష్యమా, ఆమెని ఎందుకు ఎంపిక చేయలేదు... బీసీసీఐపై ఆసీస్ వుమెన్ క్రికెటర్ ఫైర్!

First Published May 16, 2021, 10:17 AM IST

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్, కామెంటేటర్ లీసా స్టాలేకర్, బీసీసీఐ వైఖరిపై మండిపడింది. కొన్నాళ్ల క్రితం కరోనా వైరస్ కారణంగా తల్లినీ, అక్కనీ కోల్పోయిన వేదా కృష్ణమూర్తిని ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపిక చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది లీసా..

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌వుమెన్ వేదా కృష్ణమూర్తి, ఇప్పటిదాకా 48 వన్డేలు, 74 టీ20 మ్యాచుల్లో టీమిండియాకి ప్రాతినిధ్యం వహించింది. రెండు ఫార్మాట్లలో కలిపి 10 హాఫ్ సెంచరీలతో 1600+ పరుగులు చేసింది వేదా కృష్ణమూర్తి.
undefined
తాజాగా ఇంగ్లాండ్ టూర్‌కి జట్టును ప్రకటించిన బీసీసీఐ, వేదా కృష్ణమూర్తికి చోటు కల్పించలేదు. సఫారీలతో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ కరనా వైరస్ బారిన పడిన కారణంగా రాజేశ్వరి గైక్వాడ్‌ను ఇంగ్లాండ్ టూర్‌ నుంచి పక్కకుబెట్టింది బీసీసీఐ.
undefined
ఫామ్‌లో ఉన్నా కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకపోవడం, మోకాలి గాయంతో బాధపడుతూ ఉండడంతో రాజేశ్వరికి ఇంగ్లాండ్ టూర్‌ నుంచి విశ్రాంతి కల్పించిన సెలక్టర్లు, వేదా కృష్ణమూర్తి ఎందుకు పట్టించుకోలేదంటూ మండిపడింది లీసా స్టాలేకర్.
undefined
‘వేదా కృష్ణమూర్తిని వరాబోయే సిరీస్‌కి ఎంపికచేయకపోవడం ఏ మాత్రం భావ్యం కాదు. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న వేదా కృష్ణమూర్తిని కనీసం ఆడే స్థితిలో ఉన్నావా, లేదా? అసలు ఆమె పరిస్థితి ఏంటి అని కూడా బీసీసీఐ అధికారులు అడగకపోవడం నాకు కోపం తెప్పిస్తోంది.
undefined
నిజమైన అసోసియేషన్, ఆటగాళ్ల ఆటను, పారితోషకాన్ని మాత్రమే కాదు వారి బాగోగులను కూడా పట్టించుకోవాలి. ఒకేసారి ఇద్దరు కుటుంబీకులను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న వేదాకి ఇప్పుడు బీసీసీఐ భరోసా కావాలి...
undefined
నేను మాజీ క్రికెటర్‌ని అయినా ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ నిత్యం నా బాగోగుల గురించి వాకబు చేస్తూ ఉంటుంది. నాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటుంది...
undefined
ఇండియాలో ఇలాంటి క్రికెట్ అసోసియేషన్ చాలా అవసరం. బీసీసీఐ పురుష క్రికెటర్ల పట్ల ఒకలా, మహిళా క్రికెటర్ల పట్ల మరోలా ప్రవర్తించడం వల్లే వారిలో మానసిక ఒత్తిడి, డిప్రెషన్, భయం పెరిగిపోతున్నాయి...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది లీసా.
undefined
భారత మహిళా జట్టులో స్టార్ల డామినేషన్ పెరిగిపోయిందని, జట్టులో చాలామంది ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారని వుమెన్స్ టీమ్ మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ సంచలన ఆరోపణలు చేసిన మరుసటిరోజే బీసీసీఐ ద్వంద వైఖరిపై ఆరోపణలు రావడం విశేషం.
undefined
click me!