శుబ్‌మన్ గిల్ కాదు, అతనితో ఓపెనింగ్ చేయించండి.... యువరాజ్ సింగ్ సలహా...

First Published Jun 10, 2021, 3:40 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ కోసం  భారత జట్టు నెట్ ప్రాక్టీస్ మొదలెట్టేసింది. జూన్ 18న ఇంగ్లాండ్‌లోని సౌంతిప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడబోయే భారత జట్టుపై ఆశలు భారీగానే ఉన్నాయి. అయితే ఇంగ్లాండ్ పిచ్ కావడం వల్ల భారత జట్టు గెలిచే అవకాశం చాలా తక్కువేనని తేల్చేశారు విశ్లేషకులు...

‘రోహిత్ శర్మకు ఇంగ్లాండ్ పిచ్‌పై ఆడిన అనుభవం ఉంది. టెస్టుల్లో ఓపెనర్‌గా అతనికి మంచి అనుభవం కూడా వచ్చింది. ఇప్పటికే అతను ఏడు సెంచరీలు కూడా నమోదుచేశాడు...
undefined
అయితే ఇప్పటిదాకా రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కలిసి ఇంగ్లాండ్‌లో ఇంతవరకూ ఓపెనింగ్ చేయలేదు. అదీకాకుండా టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో వాడే డ్యూక్ బాల్ స్వింగ్‌ను ఎదుర్కోవడం వారికి చాలా కష్టంగా మారొచ్చు.
undefined
అయితే శుబ్‌మన్ గిల్ కంటే ఇంగ్లాండ్ పిచ్‌ల మీద ఆడిన అనుభవం ఉన్న మయాంక్ అగర్వాల్‌ను ఓపెనింగ్ చేయిస్తే బెటర్ ఏమో... ఎందుకంటే ఇంగ్లాండ్‌లో ప్రతీ సెషన్ చాలా విలువైనది...
undefined
ఉదయం పూట బంతి స్వింగ్ అవుతుంది, అలాగే సీమ్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం స్వింగ్ వేగం తగ్గుతుంది. అంటే బ్యాట్స్‌మెన్‌కి పరుగులు చేయడానికి అవకాశం దొరుకుతుంది. సాయంత్రం టీ తర్వాత మళ్లీ స్వింగ్ అవ్వడం మొదలవుతుంది...
undefined
అక్కడి పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచిది. నేను చెప్పేది ఒక్కటే.. సాధ్యమైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండడానికి ప్రయత్నించండి. పరుగులు అవే వస్తాయి’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.
undefined
న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సెన్ కూడా శుబ్‌మన్ గిల్ కంటే మయాంక్ అగర్వాల్ అనుభవం జట్టుకి బాగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు...
undefined
‘నాకు తెలిసి వాళ్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌లతో ఓపెనింగ్ చేయిస్తారు. కానీ మయాంక్ అగర్వాల్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది. అతను న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌పై ఆడాడు. అక్కడ మంచి పరుగులు కూడా సాధించాడు. కివీస్ బౌలర్లపై ఆడిన అనుభవం కూడా అతనికి ఉపయోగపడుతుంది’ అంటూ కామెంట్ చేశాడు మైక్ హెస్సెన్.
undefined
రోహిత్ శర్మకు విదేశీ పిచ్‌లపై చెప్పుకోదగ్గ రికార్డు లేదు. ఇప్పటిదాకా విదేశాల్లో 20 టెస్టులు ఆడిన రోహిత్ శర్మ, అక్కడ కేవలం 27 సగటుతో పరుగులు సాధించాడు. గత ఆసీస్ పర్యటనలో కూడా రోహిత్ నుంచి చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ రాలేదు...
undefined
ఆస్ట్రేలియాలో జరిగిన ఆఖరి రెండు టెస్టుల్లో పాల్గొన్న రోహిత్ శర్మ, మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసిన హిట్ మ్యాన్, రెండో ఇన్నింగ్స్‌లో 7 పరుగులకే అవుట్ అయ్యాడు.
undefined
అలాగే మయాంక్ అగర్వాల్ కూడా పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేదు. మొదటి టెస్టులో పృథ్వీషాతో కలిసి ఓపెనింగ్ చేసిన మయాంక్ అగర్వాల్ రెండో టెస్టులో శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్‌కి వచ్చాడు. రెండు టెస్టుల్లో ఫెయిల్ అయిన మయాంక్, మూడో టెస్టులో స్థానం కోల్పోగా నాలుగో టెస్టులో గాయపడిన హనుమ విహారి స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. అయినా పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు.
undefined
click me!