మోర్గాన్, బెయిర్ స్టో, విల్లీలకు పాజిటివ్... నిమిషాల్లోనే కొత్త జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్...

First Published Jul 6, 2021, 3:32 PM IST

శ్రీలంకతో సిరీస్ ముగించుకున్న ఇంగ్లాండ్ జట్టు, జూలై 8 నుంచి పాకిస్తాన్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. రెండు రోజుల ముందు పాక్ టూర్‌కి ఎంపికైన ప్లేయర్లకు కరోనా సోకడంతో పూర్తిగా కొత్త జట్టును ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...

పాక్‌తో సిరీస్‌కి ఎంపికైన ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో పాటు ఓపెనర్ బెయిర్ స్టో, విల్లీ పుకోవిస్కీలకు కరోనా పాజిటివ్ సోకింది...
undefined
వీరితో పాటు ఇంగ్లాండ్ సహాయక బృందంలోని నలుగురు సభ్యులకు చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో పాక్‌తో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన 16 మందినీ పక్కనబెట్టాలని నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..
undefined
ఇయాన్ మోర్గాన్, బెయిర్ స్టో, జాసన్ రాయ్‌, సామ్ బిల్లింగ్స్, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, డేవిడ్ మిల్లే, టామ్ కుర్రాన్, అదిల్ రషీద్, మార్క్ వుడ్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, లియామ్ డాసన్, జార్జ్ గార్టన్, టామ్ బాంటన్‌లతో పాటు టెస్టు కెప్టెన్ జో రూట్ కూడా పాక్‌తో వన్డే సిరీస్‌కి ఎంపికైన జట్టులో ఉన్నాడు...
undefined
వీరందరికీ పక్కనబెట్టేసి బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఓ కొత్త జట్టును తయారుచేసి, రెండు రోజుల్లో పాక్‌తో జరిగే మొదటి వన్డేకి సిద్ధం చేయబోతోంది ఇంగ్లాండ్ జట్టు...
undefined
‘ఒక్కరోజులో ఓ కొత్త జట్టును గుర్తించి, వారిని మానసికంగా శారీరకంగా పాక్‌తో సిరీస్‌కి సిద్ధం చేయాలి. ఇంగ్లాండ్ కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్ బాధ్యతలు తీసుకోవడానికి అంగీకరించడం అదృష్టమే...
undefined
కౌంటీ ఛాంపియన్‌షిప్ జరుగుతున్న సమయంలో ఇలాంటి వార్త రావడంతో వారిపై కూడా ప్రభావం పడొచ్చు... ’ అంటూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈవో టామ్ హారీసన్ కామెంట్ చేశాడు...
undefined
కొత్త జట్టును తీసుకుంటామనే వార్త బయటికి రావడంతో ఇంగ్లాండ్ జట్టు నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఇంగ్లాండ్ సీనియర్ క్రికెటర్లు రవి బోపారా, జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ట్వీట్లు చేశారు...
undefined
స్టువర్ట్ బ్రాడ్ చివరిగా 2016లో వన్డే మ్యాచ్ ఆడగా, 2014లో ఆఖరి టీ20 ఆడాడు... అలాగే జేమ్స్ అండర్సన్ చివరిగా 2015లో వన్డే ఆడగా, 2009 తర్వాత టీ20 మ్యాచులకు దూరమయ్యాడు.
undefined
అలాగే భారత సంతతి ఆటగాడు రవి బోపారా కూడా ఐదేళ్లుగా జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో ఈ ఆటగాళ్లందరికీ ఆశలు చిగురించాయి...
undefined
అయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాత్రం వీరి ఆశలపై నీళ్లు చల్లుతూ, కరోనా న్యూస్ వచ్చిన నిమిషాల్లోనే 18 మందితో కొత్త జట్టును ప్రకటించింది...
undefined
బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టులో జాక్ బాల్, డానీ బ్రిగ్స్, కార్స్, జాక్ క్రావ్లీ, బెన్ డక్కెట్, లూయిస్ జార్జెరీ, టామ్ హెల్మ్, విల్ జాక్స్, డాన్ లారెన్స్, సకిబ్, డేవిడ్ మలాన్, పర్కిసన్, ఓవర్టన్, డేవిడ్ పేన్, ఫిల్ సాల్క్, విన్స్, జాన్ సింప్సన్‌లకు చోటు కల్పించింది.
undefined
click me!