2011 వరల్డ్‌కప్ విజయం తర్వాత ధోనీని మరిచిపోయిన రవిశాస్త్రి... యువరాజ్ ఏమన్నాడంటే...

First Published Jul 6, 2021, 3:07 PM IST

28 ఏళ్ల తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2011 వన్డే వరల్డ్‌కప్‌ను సాధించింది టీమిండియా. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో హెలికాఫ్టర్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించాడు మాహీ...

2011 వన్డే వరల్డ్‌కప్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మహేంద్ర సింగ్ ధోనీ హెలికాఫ్టర్ షాట్ సిక్సర్ గురించే చెబుతారు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్...
undefined
అయితే ఆ వరల్డ్‌కప్‌లో భారత జట్టు విజయం సాధించడానికి ప్రధాన కారణం యువరాజ్ సింగ్. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన యువీ, ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా గెలిచాడు...
undefined
మాహీ హెలికాఫ్టర్ షాట్ కొట్టిన సమయంలో కామెంటేటర్‌గా ఉన్న ప్రస్తుత భారత కోచ్ రవిశాస్త్రి... ఆ విజయం తర్వాత భారత విజయంపై ఓ స్పెషల్ వీడియో పోస్టు చేశాడు...
undefined
ఆ వీడియోకు టీమిండియా మాజీ క్రికెటర్ ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్, అప్పటి యంగ్ రన్‌మెషీన్ ‘విరాట్ కోహ్లీను ట్యాగ్ చేశాడు...
undefined
రవిశాస్త్రి వీడియోకి స్పందించిన యువరాజ్ సింగ్... ‘థ్యాంక్యూ సీనియర్... నువ్వు నన్ను కూడా ట్యాగ్ చేయొచ్చు. అలాగే మాహీని కూడా. మేం కూడా వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో ఉన్నాం’ అంటూ కామెంట్ చేశాడు...
undefined
యువరాజ్ సింగ్ కామెంట్‌కి ఉలిక్కిపడిన రవిశాస్త్రి... ‘యువరాజ్ నువ్వు ఓ లెజెండ్‌వి’ అంటూ రిప్లై ఇచ్చాడు. మాహీ గురించి మాత్రం ఏ కామెంట్ చేయలేదు.
undefined
click me!