IND vs ENG: అభిషేక్ శ‌ర్మ‌తో ఇంగ్లాండ్ బ‌లి.. టీ20ల్లో భారత్ మరో రికార్డు

Published : Feb 03, 2025, 08:41 AM IST

IND vs ENG: వాంఖడే స్టేడియంలో అభిషేక్ శ‌ర్మ 135 ప‌రుగుల సూప‌ర్ ఇన్నింగ్స్ తో భార‌త్ 247 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ఇంగ్లాండ్ జ‌ట్టు కేవ‌లం 97 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. దీంతో భార‌త్ త‌న ఖాతాలో మ‌రో  రికార్డును వేసుకుంది.   

PREV
16
IND vs ENG: అభిషేక్ శ‌ర్మ‌తో ఇంగ్లాండ్ బ‌లి.. టీ20ల్లో భారత్ మరో రికార్డు
india, Varun Chakravarthy

IND vs ENG: ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో చివ‌రి, 5వ టీ20 మ్యాచ్ ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగింది. భార‌త ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌పై ఆరంభం నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఏ బౌల‌ర్ ను వ‌ద‌ల‌కుండా అటాక్ చేస్తూ వాంఖ‌డేలో ప‌రుగుల సునామీ సృస్టించాడు. 

తొలుత 17 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న అభిషేక్ శ‌ర్మ‌.. ఆ త‌ర్వాత దానిని సెంచ‌రీగా మార్చాడు. కేవ‌లం 37 బంతుల్లోనే సెంచ‌రీ సాధించాడు. ఙ‌ది భార‌త్ త‌ర‌ఫున రెండో వేగ‌వంత‌మైన సెంచ‌రీగా నిలిచింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శ‌ర్మ 54 బంతులు ఆడి 135 ప‌రుగుల ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 13 సిక్స‌ర్లు బాదాడు. 

26

టీ20 క్రికెట్ లో రెండో అతిపెద్ద విజ‌యం అందుకున్న భార‌త్

ముంబైలో జరిగిన ఐదో, చివరి టీ20లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన భారత్ టీ20ల్లో రెండో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. మెన్ ఇన్ బ్లూ 150 పరుగుల తేడాతో జోస్ బ‌ట్ల‌ర్ నాయ‌క‌త్వంలోని ఇంగ్లాండ్ జ‌ట్టును ఓడించి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. 

ఈ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 247 ప‌రుగులు చేసింది. భారీ టార్గెట్ తో బ‌రిలోకి బ్యాటింగ్ మొద‌లు పెట్టిన ఇంగ్లాండ్ జ‌ట్టు 100 ప‌రుగులు చేయ‌లేక‌పోయింది. 97 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. దీంతో భార‌త్ 150 పరుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. 

36
Image Credit: Getty Images

అభిషేక్ శ‌ర్మ దుమ్మురేపే ఇన్నింగ్స్  

అభిషేక్ శర్మ 34 బంతుల్లో 135 పరుగులు చేసి భార‌త్ కు అతి పెద్ద విజయాన్ని అందించడంతో స‌హాయ‌ప‌డ్డాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతూ కేవ‌లం 17 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ బాదాడు. ఆ త‌ర్వాత దానిని 37 బంతుల్లో సెంచ‌రీగా మార్చాడు.

త‌న ఇన్నింగ్స్ లో అభిషేక్ శ‌ర్మ ఫోర్లు, 13 సిక్స‌ర్లు బాదాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ కేవలం ఒక్క గేమ్‌ను మాత్రమే చేజార్చుకుంది. అభిషేక్ తన రికార్డుల మోతలో బౌలర్లతో ఆటాడుకున్నాడు. 

46

రెండో ఫాస్టెస్ట్ సెంచ‌రీ కొట్టిన అభిషేక్ శ‌ర్మ 

అభిషేక్ శ‌ర్మ త‌న సునామీ ఇన్నింగ్స్ లో భార‌త్ త‌ర‌ఫున టీ20 క్రికెట్ లో భార‌త్ త‌ర‌ఫున రెండో వేగ‌వంత‌మైన సెంచ‌రీని కొట్టాడు. అంత‌కుముందు, రెండో వేగ‌వంత‌మైన హాఫ్ సెంచ‌రీ సాధించాడు.

అలాగే, త‌న ఇన్నింగ్స్ లో అభిషేక్ శ‌ర్మ 14 సిక్స‌ర్లు, 7 ఫోర్లు బాదాడు. ఒక T20I ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో ఈ రికార్డు రోహిత్ శర్మ , సంజూ శాంసన్‌ల పేరిట ఉంది.

56

T20I ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయుడు:

అభిషేక్ శర్మ: 2025లో ఇంగ్లండ్‌పై 13 సిక్సర్లు

రోహిత్ శర్మ: 2017లో శ్రీలంకపై 10 సిక్సర్లు

సంజూ శాంసన్: 2024లో దక్షిణాఫ్రికాపై 10 సిక్సర్లు

తిలక్ వర్మ: 2024లో దక్షిణాఫ్రికాపై 10 సిక్సర్లు

సూర్యకుమార్ యాదవ్: 2023లో శ్రీలంకపై 9 సిక్సర్లు

66
Image Credit: Getty Images

T20I ఇన్నింగ్స్‌లో భారత ప్లేయ‌ర్ల‌ అత్యధిక స్కోర్లు:

1 - అభిషేక్ శర్మ: 2025లో 135 vs ఇంగ్లాండ్

2 - శుభమాన్ గిల్: 2023లో 126* vs న్యూజిలాండ్

3 - రుతురాజ్ గైక్వాడ్: 123* vs ఆస్ట్రేలియా 2023లో

4 - విరాట్ కోహ్లి : 122* vs ఆఫ్ఘనిస్తాన్ 2022లో

5 - రోహిత్ శర్మ: 121* vs ఆఫ్ఘనిస్తాన్ 2024లో

Read more Photos on
click me!

Recommended Stories