India's second-fastest T20I century: వాంఖడే మైదానంలో టీమిండియా 150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ తో భారత రెండో టీ20 ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు.
India's second-fastest T20I century: ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ సూపర్ విక్టరీ అందుకుంది. దీంతో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 4-1తో భారత జట్టు కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపే ప్రదర్శనలు ఇచ్చింది. మొదట బ్యాటర్లు సునామీ ఇన్నింగ్స్ ఆడగా, ఆ తర్వాత బౌలర్లు సత్తా చాటారు. దీంతో ఇంగ్లాండ్ పై భారత్ 150 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంలో యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ హీరోగా నిలిచాడు.
25
Image Credit: Getty Images
అభిషేక్ శర్మ షేక్ చేశాడు
ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో చివరి, 5వ టీ20 మ్యాచ్ వాంఖడేలో జరిగింది. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ బౌలింగ్ ను చిత్తుచేశారు. ఏ బౌలర్ ను వదలకుండా అటాక్ చేస్తూ వాంఖడేలో పరుగుల సునామీ సృష్టించాడు. తొలుత 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.. ఆ తర్వాత దానిని సెంచరీగా మార్చాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇది భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీగా నిలిచింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 54 బంతులు ఆడి 135 పరుగుల ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు బాదాడు.
35
రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టే ఛాన్స్ కోల్పోయిన అభిషేక్ శర్మ
భారత్ తరఫున టీ20 క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీని స్టార్ బ్యాటర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సాధించాడు. 2017లో ఇండోర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో శతకం సాధించిన రోహిత్ శర్మ భారత్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ రికార్డును సాధించాడు.
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసేలా అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ కొనసాగింది. కానీ, ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ రషీద్ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా అభిషేక్ కొన్ని డాట్ బాల్స్ ఆడాడు. అయినప్పటికీ 37 బంతుల్లో సెంచరీని కొట్టి అభిషేక్ శర్మ T20I లలో భారతదేశం తరపున రెండవ వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.
45
Image Credit: Getty Images
శుభ్ మన్ గిల్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత ప్లేయర్ గా నిలిచాడు. 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 126 పరుగులతో శుభ్‌మన్ గిల్ టీ20 క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ప్లేయర్ గా నిలిచాడు. అయితే, ఇప్పుడు అభిషేక్ 54 బంతుల్లో 135 పరుగులు చేసి గిల్ ను అధిగమించాడు.
55
అత్యంత వేగవంతమైన రెండో హాఫ్ సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ
అభిషేక్ శర్మ సంజూ శాంసన్ ను కూడా అధిగమించాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో సంజూ శాంసన్ 100 పరుగులు చేశాడు. దీంతో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది. ఇప్పుడు అభిషేక్ శర్మ 37 బంతుల్లోనే సెంచరీ కొట్టి సంజూ రికార్డును బ్రేక్ చేశాడు.
అలాగే, టీ20 క్రికెట్ లో అత్యంత వేగవంతమైన రెండో హాఫ్ సెంచరీ రికార్డును అభిషేక్ శర్మ సాధించాడు. కేఎల్ రాహుల్ దుబాయ్‌లో స్కాట్‌లాండ్‌పై 18 బంతుల్లో 50 పరుగులు చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. భారత్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు 12 బంతుల్లో సాధించిన యువరాజ్ సింగ్ పేరిట ఉంది. మొత్తంగా టీ20 క్రికెట్ లో 9 బంతుల్లో 50 పరుగులు చేసిన నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఐరీ పేరిట ఈ రికార్డు ఉంది.