మళ్లీ క్రీజులోకి దూసుకొచ్చిన జార్వో... ఒకే వ్యక్తి, ఇన్నిసార్లు ఎలా వస్తున్నాడు...

Published : Sep 03, 2021, 05:58 PM IST

జార్వో... ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో జో రూట్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్ల కంటే ఎక్కువగా ప్రేక్షకుల నోళ్లలో నానుతున్న పేరు. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని, క్రీజులోకి దూసుకొస్తున్న జార్వోపై హెడ్డింగ్‌లే స్టేడియంలో రానివ్వకుండా జీవితకాల నిషేధం కూడా విధించారు.

PREV
19
మళ్లీ క్రీజులోకి దూసుకొచ్చిన జార్వో... ఒకే వ్యక్తి, ఇన్నిసార్లు ఎలా వస్తున్నాడు...

నాలుగో టెస్టు సమయంలోనూ మరోసారి స్టేడియంలో ప్రత్యేక్షమయ్యాడు జార్వో. ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో మెరుపు వేగంతో క్రీజులోకి దూసుకొచ్చిన జార్వో... బ్యాటింగ్ చేస్తున్న బెయిర్‌స్టోని తాకాడు..

29

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన జార్వో, బౌలింగ్ చేస్తున్నట్టుగా యాక్షన్‌తో దూసుకొచ్చి...ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఓల్లీ పోప్‌ను వెనకనుంచి తోసేశాడు...

39

జార్వో ఇలా క్రీజులోకి రావడం, ఈ టెస్టు సిరీస్‌లో ఇది మూడోసారి. దీంతో ఇంగ్లాండ్ గ్రౌండ్ సెక్యూరిటీపై అనుమానాలు రేగుతున్నాయి. ఒకే వ్యక్తి, ఇలా ఇన్నిసార్లు ఎలా గ్రౌండ్‌లోకి రాగలుగుతున్నాడంటూ ప్రశ్నిస్తున్నారు టీమిండియా అభిమానులు..

49

‘ఇంగ్లాండ్‌లో కొందరిని గ్రౌండ్‌లోకి రానివ్వకుండా చర్యలు తీసుకోవాలి. సెక్యూరిటీ ఏర్పాట్లలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది చాలా సీరియస్ విషయం... ఫ్రాంక్ కాదు, కాబోదు... జార్వో, ఇడియట్’ అంటూ ట్వీట్ చేశాడు క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే...

59

రెండో టెస్టులో టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత జెర్సీలో క్రీజులోకి దూసుకొచ్చి హడావుడి చేశాడు ఓ ఇంగ్లీష్ క్రికెట్ ఫ్యాన్ జార్వో. తాను భారత ప్లేయర్‌ని అంటూ, బీసీసీఐ లోగో చూపిస్తూ... సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడడం అప్పట్లో తెగ వైరల్ అయ్యింది...

69

మూడో టెస్టులో క్రీజులో ప్రత్యేక్షమయ్యాడు జార్వో. రోహిత్ శర్మ అవుటైన తర్వాత భారత జెర్సీలో ప్యాడ్స్, బ్యాటు పట్టుకుని నెం.4 బ్యాట్స్‌మెన్‌లా క్రీజులోకి వచ్చేశాడు జార్వో. అతను బ్యాటింగ్‌కి సిద్ధమవుతున్న సమయంలో క్రీజులోకి వచ్చింది విరాట్ కోహ్లీ కాదని ఆలస్యంగా గుర్తించిన సెక్యూరిటీ అధికారులు, అతన్ని బలవంతంగా బయటికి తీసుకెళ్లారు...

79

సీరియస్‌గా సాగుతున్న మ్యాచ్‌లో జార్వో ఎంట్రీ, మరోసారి క్రికెట్ ఫ్యాన్స్‌కి కాస్త వినోదాన్ని పంచింది. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటికి తీసుకెళ్తుంటే, జార్వో వారిని నిలువరించేందుకు చేసిన ప్రయత్నం, అందరికీ నవ్వులు పూయించింది.

89

అయితే ఇంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఓ అభిమాని, ఇలా రెండు సార్లు క్రీజులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకే అభిమాని, ఒకటికి మూడుసార్లు సెక్యూరిటీని దాటుకుని లోపలికి వచ్చాడంటే, మరేవరైనా వస్తే ప్లేయర్ల రక్షణకి గ్యారెంటీ ఏంటని నిలదీస్తున్నారు అభిమానులు...

99

జార్వోపై హెడ్డింగ్‌లే స్టేడియంలోకి రాకుండా జీవితకాల నిషేధం విధించిన యార్క్‌షైర్ కౌంటీ క్లబ్, అతనికి జరిమానా కూడా విధించింది. దీంతో ఆగ్రహానికి గురైన జార్వో, తాను ఇక భారత క్రికెట్ ఫ్యాన్‌ని అంటూ, వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా భారత్‌కే సపోర్ట్ చేస్తానంటూ కామెంట్ చేశాడు..

click me!

Recommended Stories