INDvsENG 4th Test: ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... ఆధిక్యం దిశగా సాగుతున్న ఆతిథ్య జట్టు...

First Published Sep 3, 2021, 5:42 PM IST

నాలుగో టెస్టు ఇంగ్లాండ్ జట్టు రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 52 పరుగుల దూరంలో ఉంది ఇంగ్లాండ్. అయితే ఓల్లీ పోప్, జానీ బెయిర్‌స్టో క్రీజులో కుదురుకుపోవడంతో ఇంగ్లాండ్‌కి తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

ఓవర్‌నైట్ స్కోరు 53/3 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు, అదే స్కోరు వద్ద నైట్‌ వాచ్‌మెన్ క్రాగ్ ఓవర్టన్ వికెట్ కోల్పోయింది...

12 బంతుల్లో ఒకే పరుగు చేసిన ఓవర్టన్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఉమేశ్ యాదవ్‌కి ఇది టెస్టుల్లో 150వ వికెట్...

టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఆరో పేసర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఉమేశ్ యాదవ్. ఉమేశ్ యాదవ్ కంటే ముందు కపిల్‌దేవ్ 434, జహీర్ ఖాన్ 311, ఇషాంత్ శర్మ 311, జవగళ్ శ్రీనాథ్ 236, మహ్మద్ షమీ 195 వికెట్లతో టాప్‌లో ఉన్నారు...

67 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేసిన డేవిడ్ మలాన్ కూడా ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లోనే రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 62 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...

అయితే కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్‌ను ఓల్లీ పోప్, బెయిర్ స్టో కలిసి ఆదుకున్నారు. వరుసగా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు.

ఓల్లీ పోప్ 66 బంతుల్లో 5 ఫోర్లతో 38 పరుగులు, జానీ బెయిర్‌స్టో 63 బంతుల్లో 7 ఫోర్లతో 34 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కి 109 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

click me!