ఫేజ్ 2 ఆరంభానికి ముందు సీఎస్‌కేని వెంటాడుతున్న సమస్యలు... స్టార్ ప్లేయర్లకు గాయాలు...

First Published Sep 14, 2021, 3:30 PM IST

యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్‌ను బ్యాడ్‌లక్ వెంటాడి, వేటాడింది. స్టార్ ప్లేయర్ సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో లీగ్ ఆరంభానికి ముందే స్వదేశానికి వచ్చేయడం, హర్భజన్ సింగ్ కూడా రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది సీఎస్‌కే...

2021 లీగ్‌లో అదిరిపోయే ఆటతీరు చూపించి, పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, మరో మూడు మ్యాచులు గెలిస్తే చాలు... ఐపీఎల్ చరిత్రలో 11వ సారి ప్లేఆఫ్స్ చేరుతుంది...

అయితే యూఏఈలో జరిగే ఫేజ్ 2 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. సీఎస్‌కే ఓపెనర్ ఫాఫ్ డుప్లిసిస్, గాయంతో బాధపడుతున్నాడు...

కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్ 2021) పాల్గొంటున్న డుప్లిసిస్, అక్కడ సెంచరీతో మోత మోగించి, అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు...

ఫేజ్ 1లో అద్భుతంగా రాణించి, సీఎస్‌కే విజయాల్లో కీలకపాత్ర పోషించిన డుప్లిసిస్ గాయంతో బాధపడుతుండడంతో మళ్లీ గత సీజన్‌‌లో జరిగినట్టే జరగబోతుందా? అని భయపడుతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు...

రుతురాజ్ గైక్వాడ్, సురేష్ రైనా, అంబటి రాయుడు వంటి ప్లేయర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్ నుంచి సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ కూడా యూఏఈ చేరుకుని, క్వారంటైన్‌లో గడుపుతున్నారు...

అయితే గత సీజన్‌లో యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో ఆర్‌సీబీ తరుపున బరిలో దిగిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ, పెద్దగా రాణించలేకపోయాడు...

అదీకాకుండా ప్లేఆఫ్ సమయానికి ఇంగ్లాండ్ ప్లేయర్లు అందరూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసే క్యాంపులో చేరబోతున్నారు. అంటే ప్లేఆఫ్స్‌లో సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ వంటి కీ ప్లేయర్లు లేకుండా ఆడాల్సి ఉంటుంది.

ఇంగ్లాండ్ టూర్‌లో గాయపడిన రవీంద్ర జడేజా... ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో బరిలో దిగడం అనుమానంగానే మారింది... ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టే జడ్డూ లేకుండా ముంబైని ఓడించాలంటే చెన్నైకి కష్టమే...

మహేంద్ర సింగ్ ధోనీ కూడా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. అయితే ఈసారి ఫేజ్ 1లో బౌలింగ్‌లో అదరగొట్టిన దీపక్ చాహార్, బ్యాటింగ్ కూడా చేయగలనని శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నిరూపించుకున్నాడు...

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో శార్దూల్ ఠాకూర్ ఆడిన షాట్స్‌, క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపోయేలా చేశాయి. దీంతో డుప్లిసిస్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ని ఓపెనర్‌గా పంపించి ప్రయోగం చేయాలని సీఎస్‌కే జట్టును కోరుతున్నారు అభిమానులు...

click me!