ఆడొచ్చని చెప్పాడు... అంతలోనే పక్కనబెట్టాడు... కుల్దీప్ యాదవ్‌కి ఎందుకీ పరిస్థితి...

Published : Feb 05, 2021, 09:49 AM IST

2019 వన్డే వరల్డ్‌కప్ నుంచి కుల్దీప్ యాదవ్ ఫేట్ పూర్తిగా మారిపోయింది. అది మంచిగా కాదు, అష్టదరిద్రంగా... కుల్దీప్ యాదవ్ ఆడిన మ్యాచుల కంటే రిజర్వు బెంచ్‌కి పరిమితమైన మ్యాచులే ఎక్కువ. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ కుల్దీప్ యాదవ్‌కి అవకాశం దక్కొచ్చని చెప్పిన విరాట్ కోహ్లీ, మ్యాచ్ ఆరంభానికి ముందు అతనికి ఊహించని షాక్ ఇచ్చాడు.

PREV
17
ఆడొచ్చని చెప్పాడు... అంతలోనే పక్కనబెట్టాడు... కుల్దీప్ యాదవ్‌కి ఎందుకీ పరిస్థితి...

మొదటి టెస్టులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగాలని అనుకుంటున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ. దాంతో మెయిన్ స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఉన్నా, ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌కి చోటు దక్కినా... మూడో స్పిన్నర్‌గా అయినా కుల్దీప్ యాదవ్ జట్టులో ఉంటాడని భావించారంతా...

27

రవీంద్ర జడేజా గాయంతో మొదటి రెండు టెస్టులకు దూరం కావడం, టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు అక్షర్ పటేల్‌ గాయంతో మొదటి టెస్టులో కుల్దీప్ యాదవ్ ఉండడం గ్యారెంటీ అనుకున్నారంతా... కానీ అక్షర్ పటేల్ గాయంతో కోహ్లీ ప్లాన్ మొత్తం మార్చేశాడు...

37

అక్షర్ పటేల్ గాయంతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టెస్టు జట్టులోకి వచ్చిన షాబజ్ నదీమ్‌కి తుదిజట్టులో చోటు దక్కింది. దాంతో సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కి మరోసారి నిరాశ తప్పలేదు... రవిచంద్రన్ అశ్విన్, షాబజ్ నదీమ్‌లతో పాటు బ్యాటింగ్ చేయగల వాషింగ్టన్ సుందర్‌ని మూడో స్పిన్నర్‌గా ఎంచుకున్నాడు విరాట్ కోహ్లీ...

47

ఆస్ట్రేలియా టూర్‌లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా చోటు దక్కని కుల్దీప్ యాదవ్‌కి అజింకా రహానే భరోసా ఇచ్చాడు. స్వదేశంలో అవకాశం తప్పుకుండా దక్కుతుందని హామీ ఇచ్చాడు. కానీ ఇంగ్లాండ్ జట్టు, కుల్దీప్ యాదవ్ ఉంటాడని ఊహించి, అతన్ని ఎదుర్కోవడానికి ప్రాక్టీస్ చేసి ఉంటుందనే కారణంగా షాబజ్ నదీమ్‌ను బరిలో దింపాడు కోహ్లీ...

57

‘శ్రీలంక పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు ఎంబుల్దినీయాను ఎదుర్కోవడానికి ఇబ్బందిపడ్డారనే కారణంగా షాబజ్ నదీమ్‌ను జట్టులోకి తీసుకుని ఉండవచ్చు. బాగుంది. కానీ కుల్దీప్ పరిస్థితి ఏంటి... టీమ్ మేనేజ్‌మెంట్ అతని ఓపికకు పరీక్ష పెడుతున్నట్టుగా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే...

67

‘రెండేళ్ల క్రితం టెస్టుల్లో భారత జట్టుకి మొదటి ఛాయిస్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు కుల్దీప్ యాదవ్. కానీ ఇప్పుడు అతను ప్రవాహంలో నెట్టుకువచ్చేందుకు యుద్ధం చేస్తున్నాడు. అయితే అతను ధైర్యంగా ఉండాలి. రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ కూడా ఇలాంటి పరీక్షలు ఎదుర్కొన్నవారే. వారి నుంచి స్ఫూర్తి పొంది, కుల్దీప్ యాదవ్ ఓపిగ్గా ఉండాలి...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...

77

2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత 12 మ్యాచులు ఆడిన కుల్దీప్ యాదవ్, 15 వికెట్లు పడగొట్టాడు. అయితే 19 మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు కుల్దీప్ యాదవ్... ఈ పీరియడ్‌లో ఇన్ని మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కి పరిమతమైన భారత క్రికెటర్ మరెవ్వరూ లేరు. ఐపీఎల్ 2020లో కూడా కుల్దీప్ యాదవ్ ఎక్కువగా రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు..

click me!

Recommended Stories