ఐదు మ్యాచుల యాషెస్ సిరీస్, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఒక్కటేనా... టెస్టు ఛాంపియన్‌షిప్‌పై స్టువర్ట్ బ్రాడ్..

First Published May 14, 2021, 11:04 AM IST

ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తొలిసారి టెస్టు ఫార్మాట్‌లో చేపడుతున్న మెగా ఈవెంట్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్. ఫైనల్‌కి చేరుకున్న ఈ మెగా ఈవెంట్ పాయింట్ల పద్దతిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్. 

దాదాపు రెండేళ్లపాటు సాగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ద్వైపాక్షిక సిరీస్‌ల ఫలితాలను బట్టి, పాయింట్లను కేటాయించింది ఐసీసీ... టెస్టు విజయం సాధిస్తే 2 పాయింట్లు, సిరీస్ గెలిస్తే 5 పాయింట్లు కేటాయించింది. దీనిపై తీవ్ర అభ్యంతరం లేవనెత్తాడు స్టువర్ట్ బ్రాడ్...
undefined
‘వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ చాలా మంచి కాన్సెప్ట్. కానీ దాన్ని నిర్వహిస్తున్న పద్ధతి మాత్రం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోంది. ఇది మొట్టమొదటి టోర్నీ కాబట్టి ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం చాలా ఉంది...
undefined
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్‌, ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు టెస్టుల యాషెస్‌తో సమానమేనా... ’ అంటూ ప్రశ్నించాడు స్టువర్ట్ బ్రాడ్...
undefined
‘టెస్టులకు క్రేజ్ పెంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, క్రికెట్‌కి చాలా మేలు చేస్తుంది. కానీ చిన్నచిన్న విషయాలపై ఫోకస్ పెడితే, ఇది ఇంకా బెటర్ అవుతుంది...
undefined
మాకు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే అవకాశం ఉండింది. కానీ ఇంగ్లాండ్ ఆడిన బిజీ క్రికెట్ మా ఫైనల్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది...’ అంటూ కామెంట్ చేశాడు స్టువర్ట్ బ్రాడ్...
undefined
34 ఏళ్ల స్టువర్ట్ బ్రాడ్ 146 టెస్టుల్లో 517 వికెట్లు తీసి... సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా అండర్సన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు స్టువర్ట్ బ్రాడ్.
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 17 మ్యాచులు ఆడిన టీమిండియా, పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లను ఓడించిన టీమిండియా, ఫైనల్‌కి అర్హత సాధించింది...
undefined
అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 21 టెస్టులు ఆడిన ఇంగ్లాండ్, పాయింట్ల పరంగా టీమిండియా తర్వాతి స్థానంలో నిలిచినా... విజయాల శాతం పరిగణనలోకి తీసుకోవడంతో నాలుగోస్థానానికి పరిమితమైంది.
undefined
ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన మొదటి టెస్టుకి ముందు వరకూ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న టీమిండియా, ఆ మ్యాచ్‌లో ఓడిన తర్వాత నాలుగోస్థానానికి పడిపోయింది. దాంతో ఈ విన్నింగ్ పర్సంటేజ్ పద్ధతి ఏంటో నాకు అర్థం కావడం లేదని కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
undefined
click me!