37 మంది బ్యాటింగ్ చేస్తే, ఛతేశ్వర్ పూజారా ఒక్కడే... రోహిత్ శర్మ బాదినా అది...

Published : May 14, 2021, 10:08 AM IST

ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి అర్హత సాధించిన టీమిండియా, న్యూజిలాండ్‌తో తుదిపోరు కోసం సిద్ధమవుతోంది. ముందు లార్డ్స్ స్టేడియంలో నిర్వహించాల్సిన ఫైనల్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్ ఫైనల్ రేసు నుంచి తప్పుకోవడంతో సౌంతిప్టన్‌కి మార్చిన విషయం తెలిసిందే..

PREV
19
37 మంది బ్యాటింగ్ చేస్తే, ఛతేశ్వర్ పూజారా ఒక్కడే... రోహిత్ శర్మ బాదినా అది...

సౌంతిప్టన్‌లోని హంప్‌షైర్ బౌల్ స్టేడియంలో జూన్ 18 నుంచి 22 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ స్టేడియంలో భారత బ్యాట్స్‌మన్‌కి ఏ మాత్రం మంచి రికార్డు లేదు. 

29

ఇప్పటివరకూ ఈ స్టేడియంలో 37 మంది భారత బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేశారు. అయితే అందులో ఛతేశ్వర్ పూజారా మాత్రమే సెంచరీ సాధించారు. 

39

2018లో జరిగిన టెస్టులో మొయిన్ ఆలీ ఐదు వికెట్లు తీసి భారత జట్టును ముప్పుతిప్పలు పెట్టినా, పూజారా అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 195 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో 9 వికెట్‌కి ఇషాంత్ శర్మ 32, 10వ వికెట్‌కి బుమ్రాతో కలిసి 46 పరుగుల అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పిన పూజారా 257 బంతుల్లో 16 ఫోర్లతో 132 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

49

టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా ఘోరంగా ఫెయిల్ అయిన సమయంలో టెయిలెండర్లు భాగస్వామ్యాలు నిర్మిస్తూ, పూజారా సాధించిన ఈ సెంచరీ... ‘మోడ్రన్ వాల్’ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ సెంచరీగా గుర్తింపు దక్కించుకుంది.

59

భారత సారథి విరాట్ కోహ్లీ ఇక్కడ రెండు మ్యాచులు ఆడి 42.75 సగటుతో 171 పరుగులు చేస్తే, అజింకా రహానే 56 సగటుతో 168 పరుగులు సాధించాడు. పూజారా 163 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

69

భారత బౌలర్ షమీకి ఇక్కడ మంచి రికార్డు ఉంది. ఈ పిచ్‌లో 2 మ్యాచులు ఆడిన షమీ, 7 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా ఒక మ్యాచ్ ఆడి 5 వికెట్లు తీయగా, జస్ప్రిత్ బుమ్రా 4 వికెట్లు తీశాడు.

79

చివరిగా ఇక్కడ 2014, 2018లో ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచులు ఆడింది టీమిండియా. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో 266 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు కాగా, రెండో మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓడింది. 

89

భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ కూడా ఇక్కడ సెంచరీ సాధించాడు. అయితే రోహిత్ సాధించిన సెంచరీ వన్డేల్లో కావడంతో అది లెక్కలోకి రాదు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 144 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 122 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అజేయంగా నిలిచి టీమిండియాకి విజయాన్ని అందించాడు.

99

న్యూజిలాండ్ ఇప్పటివరకూ ఇక్కడ ఒక్క టెస్టు కూడా ఆడలేదు. అయితే ఇంగ్లాండ్ పిచ్‌లు వారికి పెద్దగా కష్టం కాకపోవచ్చు. కాబట్టి ఎలా చూసుకున్నా భారత జట్టు ఈ పిచ్‌లకు ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచిది...

click me!

Recommended Stories