టీమిండియాతో ఐదో టెస్టుకి జట్టుని ప్రకటించిన ఇంగ్లాండ్... సిరీస్ డ్రా కోసం అస్త్రాలను సిద్ధం చేసి...

First Published Jun 28, 2022, 1:23 PM IST

గత నెల వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 టోర్నీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న ఇంగ్లాండ్... వరుసగా హ్యాట్రిక్ విజయాలతో టాప్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన న్యూజిలాండ్‌ను వైట్ వాష్ చేసి క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్, టీమిండియాతో జరిగే నిర్ణయాత్మక ఐదో టెస్టుకి జట్టుని ప్రకటించింది...

కెప్టెన్‌గా బెన్ స్టోక్‌ వ్యవహరిస్తుంటే సీనియర్ పేసర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లతో పాటు మాజీ కెప్టెన్ జో రూట్‌కి ఇండియాతో ఆడే ఐదో టెస్టులో చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ దక్కించుకున్న జో రూట్, టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు..
 

Jonny Bairstow-Ben Stokes

న్యూజిలాండ్‌పై చితక్కొట్టిన జానీ బెయిర్‌స్టోతో పాటు సామ్ బిల్లింగ్స్‌, బెన్ ఫోక్స్‌లను ఇండియాతో ఐదో టెస్టుకి వికెట్ కీపర్లుగా ఎంపిక చేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్‌కి ఐదో టెస్టులో చోటు దక్కలేదు...

Ben Foakes

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టుకి ముందు కరోనా బారిన పడిన బెన్ ఫోక్స్, ఇండియాతో జరిగే ఐదో టెస్టుకి అందుబాటులో ఉండబోతున్నాడు. సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్‌కి కూడా ఐదో టెస్టు టీమ్‌లో ప్లేస్ లభించింది.

Ben Stokes

‘ఇండియా ఎప్పుడూ క్లిష్టమైన ప్రత్యర్థే. వాళ్లతో సిరీస్‌ను మేం డ్రా చేసుకోవాల్సి ఉంది. ఇదే మైండ్‌సెట్‌తో ఐదో టెస్టును ముగించాలని అనుకుంటున్నాం... మా ఆటతీరులో మార్పు ఉండదు...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ నయా టెస్టు సారథి బెన్ స్టోక్స్...

Joe Root-Ollie Pope

టీమిండియాతో ఐదో టెస్టుకి ఇంగ్లాండ్ జట్టు ఇది: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్, హారీ బ్రూక్, జాక్ క్రావ్‌లీ, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెగ్ ఓవర్టన్, జమీ ఓవర్టన్, మాథ్యూ ప్యాట్స్, ఓల్లీ పాప్, జో రూట్..

ఐదో టెస్టుకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, శ్రీకర్ భరత్

రోహిత్ శర్మ కరోనా బారిన పడడంతో ఐదో టెస్టు సమయానికి అతను కోలుకోకపోతే, స్టాండ్‌ బై ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ కూడా ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్నాడు. రోహిత్ అందుబాటులో లేకపోతే జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్‌లలో ఒకరికి టీమిండియా కెప్టెన్సీ దక్కవచ్చు... 

click me!