INDvsENG: 134 పరుగులకి ఇంగ్లాండ్ ఆలౌట్... మరోసారి ఐదు వికెట్లు తీసిన అశ్విన్...

First Published Feb 14, 2021, 3:18 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టుకి మంచి ఆధిక్యం దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 134 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్  ఐదు వికెట్లు తీసి, ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్‌కి 29వ ఐదు వికెట్లు ప్రదర్శన కాగా అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీశారు.

సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు ఓపెనర్ రోరీ బర్న్స్. ఆ తర్వాత డొమినిక్ సిబ్లీ, లారెన్స్ కలిసి 16 పరుగులు జోడించారు.
undefined
25 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి సిబ్లీని రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. 16 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. కెప్టెన్ జో రూట్ 6 పరుగులకే పెవిలియన్ చేరడంతో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్.
undefined
9 పరుగులు చేసిన డానియల్ లారెన్స్‌ని అశ్విన్ అవుట్ చేయగా, గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన జో రూట్‌ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ బౌల్డ్ కావడంతో 52 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్.
undefined
22 పరుగులు చేసిన ఓల్లీ పోప్‌ను మహ్మద్ సిరాజ్ అవుట్ చేయగా 6 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
undefined
ఓల్లీ స్టోన్ 1 పరుగు, జాక్ లీచ్ 5 పరుగులు చేయగా స్టువర్ట్ బ్రాడ్ డకౌట్ అయ్యాడు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ 107 బంతుల్లో 4 ఫోర్లతో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...
undefined
రవిచంద్రన్ అశ్విన్‌కి టెస్టుల్లో 29వ సారి 5 వికెట్లు తీశాడు. అనిల్ కుంబ్లే 35 సార్లు తర్వాత అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్‌గా ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్.
undefined
ఇండియాలో ఇంగ్లాండ్‌కి ఇది రెండో అత్యల్ప స్కోరు. 1981లో ముంబైలో 102 పరుగులకి ఆలౌట్ అయిన ఇంగ్లాండ్, చెన్నైలో 134 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
undefined
బ్రాడ్‌ను అవుట్ చేసిన అశ్విన్, 200 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసిన మొట్టమొదటి బౌలర్‌గా నిలిచాడు.. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్.
undefined
అనిల్ కుంబ్లే 63 మ్యాచుల్లో 350 వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ 45 మ్యాచుల్లో 268 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. హర్భజన్ సింగ్ 265 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
undefined
click me!