వాళ్లను నమ్మి మోసపోయిన పృథ్వీ షా.. నమ్మించి మోసం చేశారని ఫైర్ అయిన ముంబై బ్యాటర్

Published : Oct 05, 2022, 09:52 AM IST

IND vs SA ODI: టీమిండియా యువ ఆటగాడు, మరో సెహ్వాగ్ అని అభిమానులతో ప్రశంసలు అందుకుంటున్న  ముంబై బ్యాటర్ పృథ్వీ షా కు భారత సీనియర్ సెలక్షన్ కమిటీ మరోసారి షాకిచ్చింది. దక్షిణాఫ్రికా సిరీస్ లో కూడా అతడిని ఎంపిక చేయలేదు. 

PREV
17
వాళ్లను నమ్మి మోసపోయిన పృథ్వీ షా.. నమ్మించి మోసం చేశారని  ఫైర్ అయిన ముంబై బ్యాటర్

దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న ముంబైకర్ పృథ్వీ షా  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పెద్దలు, నేషనల్ సెలక్షన్ కమిటీ పై గుర్రుగా ఉన్నాడా..? అంటే  అవుననే సమాధానం వినిపిస్తున్నది.  వాళ్ల పేరు ప్రత్యక్షంగా చెప్పకపోయినా ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం వారినే లక్ష్యంగా చేసుకుని  పోస్టు పెట్టాడు. 

27

దక్షిణాఫ్రికాతో  వన్డే సిరీస్ ఆడేందుకు గాను  జాతీయ సెలక్టర్లు.. రెండ్రోజుల క్రితమే 17 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తున్న ఈ జట్టుకు శ్రేయాస్ అయ్యర్  వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ జట్టులో  పృథ్వీ షా పేరు తప్పకుండా ఉంటుందని భావించినా సెలక్టర్లు మాత్రం అతడికి మొండిచేయి చూపారు. 

37

ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షా స్పందిస్తూ.. ‘వాళ్ల మాటలను అస్సలు నమ్మొద్దు. వారి చర్యలను మాత్రమే నమ్మండి. ఎందుకంటే  వాళ్లు మాట్లాడే మాటలు అర్థరహితమైనవని వారి చర్యలు నిరూపిస్తాయి..’ అని ఉన్న కొటేషన్ ను షేర్ చేశాడు. 

47

ఇందులో  షా  ఎవరిని టార్గెట్ చేసుకుని ఈ పోస్ట్ పెట్టాడనే విషయం  స్పష్టంగా  చెప్పనప్పటికీ  సోషల్ మీడియాలో మాత్రం అతడు బీసీసీఐ, సెలక్టర్లను లక్ష్యంగా చేసుకున్నాడని కామెంట్స్ వెళ్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ తో పాటు దేశవాళీలో కూడా షా రాణిస్తున్నాడు.  

57

ఇటీవలే ముగిసిన దులీప్ ట్రోఫీలో రెండు  మ్యాచ్ లలో కలిపి  105 సగటుతో 315 పరుగులు చేశాడు. అంతకుముందు రంజీ సీజన్ లో కూడా రాణించాడు. ఇంత చేసినా సెలక్టర్లు అతడిని  ఇటీవల న్యూజిలాండ్ ఏ సిరీస్ తో పాటు తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్ లో కూడా ఎంపిక చేయలేదు.   

67

అయితే దేశవాళీలో రాణిస్తే జాతీయ జట్టులోకి షాను ఎంపిక చేస్తారని అతడికి సెలక్టర్లలో ఎవరైనా హామీ  ఇచ్చి  తర్వాత మాట తప్పడంతోనే  షా ఇలా ఆగ్రహంగా ఉన్నాడని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

77

షా ఇలా క్రిప్టిక్ పోస్టులు చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో ఐపీఎల్ ముగిసిన తర్వాత  దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్ లో అతడిని ఎంపిక చేయకపోవడంపై  స్పందిస్తూ.. ‘ఎప్పుడూ నమ్మకాన్ని వదులుకోకండి.. అద్భుతాలు మీ మార్గంలోనే ఉన్నాయి’ అని షిర్డీ సాయిబాబా ఉన్న ఫోటోను జతచేసి పోస్ట్ చేశాడు.

click me!

Recommended Stories