Babar Azam: టీ20 ప్రపంచకప్ కు ముందు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ ను ముక్కోణపు సిరీస్ ఫైనల్లో ఓడించి ట్రోఫీని దక్కించుకుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు బాబర్ ఆజమ్ కు ఓ జర్నలిస్టు తిక్క ప్రశ్న వేశాడు. కానీ బాబర్.. అతడడికి విజయంతోనే సమాధానమిచ్చాడు.
పాకిస్తాన్ ఫైనల్లో గెలుస్తుందా..? అని ఓ జర్నలిస్టు వేసిన తిక్క ప్రశ్నకు ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్ గెలుపుతోనే సమాధానమిచ్చి అతడి నోరు మూయించాడు. శుక్రవారం న్యూజిలాండ్ తో జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్.. 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
27
అసలేం జరిగిందంటే.. గురువారం పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ తో ముగిసిన మ్యాచ్ లో విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది. మ్యాచ్ అనంతరం బాబర్ ఆజమ్ విలేకరుల సమావేశానికి వచ్చాడు.
37
పాత్రికేయుల సమావేశంలో బాబర్ ను పాకిస్తాన్ కు చెందిన ఓ జర్నలిస్టు.. ‘ఇటీవలి కాలంలో మీరు ఫైనల్స్ లో విఫలమవుతున్నారు. ఈసారైనా గెలుస్తారన్న విశ్వాసముందా..’ అని ప్రశ్నించాడు. ఇటీవల ఆసియా కప్ ఫైనల్స్ తో పాటు గతేడాది టీ20 ప్రపంచకప్ సెమీస్ లో పాకిస్తాన్ ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రశ్నకు బాబర్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
47
ఆజమ్ స్పందిస్తూ.. ‘మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మ్యాచ్ లో గెలుపోటములు కామన్. ఫైనల్ లో గెలుస్తామా..? లేదా..? అన్నది ముందే ఎలా చెప్పగలం? మ్యాచ్ ఆడటం మా నైతిక ధర్మం. అంతేతప్ప గెలుస్తామా..? ఓడుతామా..? అన్నది మా చేతుల్లో లేదు. కానీ ఒకసారి గ్రౌండ్ లోకి దిగాక వంద శాతం గెలవడానికే ప్రయత్నిస్తాం..’అని అన్నాడు.
57
ఈ మాటలను మనసులో పెట్టుకున్నాడో లేక జర్నలిస్టుకు విజయంతోనే సమాధానం చెప్పాలనుకున్నాడో ఏమో గానీ న్యూజిలాండ్ తో శుక్రవారం ముగిసిన ఫైనల్స్ లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
67
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కేన్ విలిమయ్సన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్.. 19.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
77
పాక్ బ్యాటర్లలో రిజ్వాన్, నవాజ్, ఇఫ్తికార్ అహ్మద్ రాణించారు. ఫలితంగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ కలిసి పోటీపడిన ముక్కోణపు సిరీస్ ను బాబర్ ఆజమ్ అండ్ కో ఎగురేసుకుపోయింది.