ఐపిఎల్ 2026 లో వైభవ్ సాధించిన అవార్డులు..
రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, తన రెండో ఐపీఎల్ సీజన్‌ను రికార్డుల మోతతో ముగించాడు. తన బ్యాటింగ్ పవర్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ చిన్న వయసులోనే వైభవ్ కనబరిచిన నిలకడ, అతని స్ట్రైక్ రేట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ ప్రపంచ క్రికెట్‌లో ఒక మేటి ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఒక ప్రామిసింగ్ యంగ్‌స్టర్ స్థాయి నుంచి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే స్టార్‌గా మారిపోయాడు. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 48.50 సగటుతో, 237.30 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తంగా ఈ సీజన్లో 776 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న వైభవ్ ఐపీఎల్ 2026 లో ఏకంగా ఐదు ప్రధాన అవార్డులను కైవసం చేసుకున్నాడు. అత్యధిక పరుగుల ఆరెంజ్ క్యాప్ తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ అవార్డులను గెలుచుకున్నాడు. ఈ అవార్డులతో పాటు అతనికి రూ.55 లక్షల ప్రైజ్ మనీ, సరికొత్త టాటా సియెర్రా కారు కూడా బహుమతిగా లభించాయి.