హర్షల్ పటేల్ : టీ20 స్పెషలిస్ట్ ఆల్ రౌండర్ హర్షల్ పటేల్ ఐపిఎల్ లో అద్భుతాలు చేయగల ఆటగాళ్లలో ఒకడు. అంతర్జాతీయ టీ20లో టీమిండియాకు ఆడిన అనుభవం ఈ ఐపిఎల్ లో అతడికి కలిసిరావచ్చు. అందువల్లే సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇతడు కీలకమైన ఆటగాడు.
హర్షల్ పటేల్ మంచి బ్యాట్ మెన్ మాత్రమే కాదు మీడియం పేస్ బౌలర్. గతంలో బెంగళూరు. పంజాబ్, డిల్లీ తరపున ఆడిన అతడు ప్రస్తుతం సన్ రైజర్స్ లో కొనసాగుతున్నారు. అవసరమైనప్పుడు బాల్ తోనే కాదు బ్యాట్ తోనూ అద్భుతాలు చేయగలడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడే సత్తాగల ఆటగాడు హర్షల్ పటేల్.
హర్షల్ పటేల్ ను తెలుగు ఫ్యాన్స్ 'హబ్సిగూడ హర్షల్' అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇలా తమ అభిమాన టీం తరపున ఆడుతున్న అతడిని తమవాడిగానే ట్రీట్ చేస్తున్నారు. హర్షల్ కూడా తెలుగు ఫ్యాన్స్ కు మరింత దగ్గర కావాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ను గెలిపించే మంచి ఇన్నింగ్స్ ఆడాల్సివుంటుంది. అతడు చెలరేగితే ఇదేమంత కష్టం కాదు.