భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ రిలేషన్ షిప్ లో విభేధాలు ఉన్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం సానియా ఇన్ స్టాగ్రామ్ నుంచి షోయబ్ మాలిక్ తో ఉన్న ఫోటోలన్నీ డిలీట్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత సానియా, షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారని పుకార్లు వచ్చాయి. అయితే, కొంత కాలంగా ఈ విషయం సద్దుమనిగి పోగా, ఇప్పుడు మరోసారి సానియా-షోయబ్ పెండ్లి, విడాకుల అంశం తెరమీదకు వచ్చింది. దీనికి కారణంగ సానియా మీర్జా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్టు.