India vs Afghanistan: మ‌ళ్లీ నిరాశపరిచిన రోహిత్ శ‌ర్మ‌.. ఇలా అయితే కష్టమే.. !

First Published | Jan 14, 2024, 9:16 PM IST

IND vs AFG 2nd T20I: ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య 2వ టీ20 మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘ‌నిస్తాన్.. భారత్ ముందు 173 టార్గెట్ ఉంచింది. అయితే, ఛేజింగ్ కు దిగిన భార‌త్ కు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. రోహిత్ శ‌ర్మ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. 
 

Rohit Sharma

India vs Afghanistan 2nd T20: ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య 2వ టీ20 మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘ‌నిస్తాన్ భారత్ ముందు 172 పరుగుల టార్గెట్ ఉంచింది. అఫ్ఘన్ టీమ్ 20 ఓవ‌ర్ల‌లో 172 పరుగులకు ఆలౌట్ అయింది. గుల్బాదిన్ నబీ 57 పరుగులతో రాణించాడు. నజీబుల్లా జద్రాన్ 23 పరుగులు, కరీం జనత్ 20, ముజీబ్ ఉర్ రెహమాన్ 21 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, అక్ష‌ర్ ప‌టేల్ 2, ర‌వి బిష్ణోయ్ 2, శివం దుబే 1 వికెట్ తీసుకున్నాడు.  టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది.


భారత్ ముందు 173 టార్గెట్ ఉంచింది. అయితే, ఛేజింగ్ కు దిగిన భార‌త్ కు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. ఎలాంటి ప‌రుగులు చేయ‌కుండానే భారీ షాట్ ఆడ‌బోయి ఔట్ అయ్యాడు. 

Rohit Sharma

రోహిత్ శర్మకు ఇది వరుసగా రెండో డకౌట్. కెప్టెన్ భారీ షాట్ అడేందుకు ప్ర‌య‌త్నించి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ మ్యాచ్ లో ఇది ఆఫ్ఘ‌నిస్తాన్ కు తొలి వికెట్‌. 

rohit

భార‌త్ అఫ్ఘ‌నిస్తాన్ టీ20 సిరీస్ తొలి మ్యాచ్ లో కూడా రోహిత్ శ‌ర్మ డ‌కౌట్ అయ్యాడు. ఎలాంటి ప‌రుగులు చేయ‌కుండానే మొహాలీలో ర‌నౌట్ గా గ్రౌండ్ నుంచి వెనుదిరిగాడు.

rohit

ఫ్గానిస్థాన్ తో జరిగిన రెండో మ్యాచ్ లో ఆడిన రోహిత్ శర్మ 150 టీ20లు ఆడిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. 14 నెలల పాటు అంతర్జాతీయ టీ20కి దూరంగా ఉన్న రోహిత్ శ‌ర్మ మొహాలీలో జరిగిన తొలి టీ20లో తిరిగి జట్టులోకి వచ్చాడు. రీఎంట్రీలో భార‌త్ కు విజ‌యాన్ని అందించి 100 టీ20 విజ‌యాలు అందించిన ప్లేయ‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు.

Latest Videos

click me!