మీ వల్లే నా కల నెరవేరింది... ఆర్‌సీబీకి థ్యాంక్స్ చెప్పిన దినేశ్ కార్తీక్...

First Published Sep 15, 2022, 3:59 PM IST

దినేశ్ కార్తీక్... టాలెంట్ ఉన్నా, దానికి తగిన అవకాశాలు దక్కించుకోలేకపోయిన ప్లేయర్. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా టీమ్‌లో సెటిల్ అయిపోవడంతో దినేశ్ కార్తీక్ లాంటి ప్లేయర్లు, టీమ్‌లో చోటు దక్కించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే పడిలేచిన కెరటంలా ధోనీ రిటైర్మెంట్ తర్వాత రెండేళ్లకు అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఘనంగా రీఎంట్రీఇచ్చాడు దినేశ్ కార్తీక్...

2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు దినేశ్ కార్తీక్. అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ, అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉండడంతో మాహీని ఎందుకు సెలక్ట్ చేయలేదని చాలా చర్చ జరిగింది. అయితే దినేశ్ కార్తీక్‌ని ఎవ్వరూ పట్టించుకోలేదు...
 

ఐపీఎల్ 2020, ఐపీఎల్ 2021 సీజన్లలో కొన్ని మ్యాచుల్లో మెరుపులు మెరిపించిన దినేశ్ కార్తీక్, నిదహాస్ ట్రోఫీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై ఆఖర్లో చేసిన ఫినిషింగ్‌నే గుర్తు పెట్టుకున్నారు అభిమానులు. రెండేళ్ల పాటు జట్టుకి దూరం కావడంతో ఇక దినేశ్ కార్తీక్‌ కెరీర్ ముగిసినట్టే అనుకున్నారు..

Dinesh Karthik

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇవ్వడానికి ముందే కామెంటేటర్‌గా మారి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్లేయర్లను ఇంటర్వ్యూలు కూడా చేశాడు దినేశ్ కార్తీక్. కామెంటేటర్‌గా మంచి మార్కులు కొట్టేశాడు. అయితే ఐపీఎల్ 2022 సీజన్‌, దినేశ్ కార్తీక్‌ కెరీర్‌లో మళ్లీ జీవం పోసింది.

Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో దినేశ్ కార్తీక్‌ని రూ.5.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. ఏబీ డివిల్లియర్స్ లేని లోటు తీరుస్తాడని ఆశలు పెట్టుకున్న దినేశ్ కార్తీక్, ఆ రేంజ్‌లో కాకపోయినా మంచి పర్పామెన్స్‌తో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు...

ఐపీఎల్ 2022లో 330 పరుగులు చేసి ఇంప్రెస్ చేసిన తర్వాత అన్యూహ్యంగా భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకున్న దినేశ్ కార్తీక్, ఆసియా కప్ 2022 ఆడాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులోనూ దినేశ్ కార్తీక్‌కి చోటు దక్కింది. 

‘దినేశ్ కార్తీక్, నీకు టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది. స్పెషల్ పర్సన్ నుంచి చాలా స్పెషల్ కమ్‌బ్యాక్...’ అంటూ దినేశ్ కార్తీక్‌ని విష్ చేస్తూ పోస్టు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ వీడియోపై దినేశ్ కార్తీక్ స్పందించాడు...

‘నా ఈ ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషించినందుకు ఆర్‌సీబీకి థ్యాంక్స్. మీ వల్లే నా కల నెరవేరింది. ముఖ్యంగా ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెబుతున్నా. టీమిండియాకి మ్యాచులు ఆడిన సమయంలో కూడా ఆర్‌సీబీ, ఆర్‌సీబీ అని అరుస్తూ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు... ఐ లవ్ యూ...’ అంటూ కామెంట్ చేశాడు దినేశ్ కార్తీక్..

Image credit: PTI

ఆసియా కప్ 2022 టోర్నీలో రెండు మ్యాచులు ఆడిన దినేశ్ కార్తీక్, మొత్తంగా ఒకే ఒక్క బంతిని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్‌ని ఆడించిన భారత జట్టు, భారీ మూల్యం చెల్లించుకుంది. ఆసియా కప్‌లో రిషబ్ పంత్ ఫెయిల్ కావడంతోట టీ20 వరల్డ్ కప్‌లో దినేశ్ కార్తీక్‌ పాత్ర కీలకంగా మారింది.

click me!