అండర్ 19 ఆసియా కప్, ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2022 టోర్నీలు గెలిచిన యంగ్ కెప్టెన్ యశ్ ధుల్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ తరుపున రంజీ మ్యాచ్ ఆడుతున్న యశ్ ధుల్, తన ఆరంగ్రేటం మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు నమోదు చేశాడు...
మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు యశ్ ధుల్...
210
తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 150 బంతుల్లో 18 ఫోర్లతో 113 పరుగులు చేసిన యశ్ ధుల్, రెండో ఇన్నింగ్స్‌లో 200 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు...
310
ఇంతకుముందు 1952-53 సీజన్‌లో నారీ కాంట్రాక్టర్, గుజరాత్ తరుపున ఆరంగ్రేటం మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 152, రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...
410
ఆ తర్వాత 2012-13 రంజీ సీజన్‌లో మహారాష్ట్ర తరుపున ఎంట్రీ ఇచ్చిన విరాగ్ అవతే తొలి ఇన్నింగ్స్‌లో 126, రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేశాడు...
510
రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరుపున రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన ఏడో బ్యాటర్ యశ్ ధుల్. ఇంతకుముందు మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ, సురిందర్ ఖన్నా, మదన్ లాల్, అజయ్ శర్మ, రమన్ లంబా, రిషబ్ పంత్ ఈ ఫీట్ సాధించారు...
610
మరో ఓపెనర్ ధ్రువ్ షోరే కూడా 165 బంతుల్లో 107 పరుగులు చేసి సెంచరీ బాదడంతో తొలి వికెట్‌కి అజేయంగా 218+ పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు..
710
తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 452 పరుగులకి ఆలౌట్ అయితే, తమిళనాడు 494 పరుగులకి ఆలౌట్ అయ్యి 44 పరుగుల ఆధిక్యాన్ని సాధించగలిగింది...
810
బాబా ఇంద్రజిత్ 117 పరుగులు చేయగా షారుక్ ఖాన్ 148 బంతుల్లో 20 ఫోర్లు, 10 సిక్సర్లతో 194 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
910
ముంబై, సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఛతేశ్వర్ పూజారా, రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు బ్యాటింగ్ చేశాడు...
1010
83 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 91 పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఛతేశ్వర్ పూజారా. వికెట్ కీపర్ స్నెల్ పటేల్ 155 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 98 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...