బ్రాండ్ విలువ‌లో తోపులు ఈ ఐదురుగు క్రికెట‌ర్లు !

First Published | Jul 21, 2024, 11:05 PM IST

India's most valued celebrity :  బాలీవుడ్ తారల‌ను అధిగ‌మించి భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచాడు. అలాగే, అత్య‌ధిక బ్రాండ్ విలువ క‌లిగిన క్రికెట‌ర్ గా కొన‌సాగుతున్నాడు. 
 

India's most valued celebrity : క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం.. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్‌లను అధిగమించి విరాట్ కోహ్లీ దేశంలో అత్య‌ధిక బ్రాండ్ విలువ క‌లిగిన సెల‌బ్రిటీగా నిలిచాడు. కింగ్ కోహ్లీ బ్రాండ్ విలువ 29% పెరిగి $227.9 మిలియన్లకు చేరుకుంది. దేశంలోని అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన టాప్ 5 భారతీయ క్రికెటర్లను గ‌మ‌నిస్తే.. 

హార్దిక్ పాండ్యా

క్రోల్ తాజా 'సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2023' ప్ర‌కారం.. బ్రాండ్ విలువ పరంగా  టాప్ 5 క్రికెట‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. ఈ నివేదిక ప్రకారం 38 మిలియన్ డాలర్ల విలువతో హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో ఉన్నాడు.


రోహిత్ శర్మ

టీమిండియాను ప్ర‌పంచ ఛాంపియ‌న్ గా నిల‌బెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ. ఐపీఎల్ లో ముంబై ఇండియ‌న్స్ కు ఐదు సార్లు ట్రోఫీని అందించి విజ‌య‌వంత‌మైన కెప్టెన్ గా రికార్డు సృష్టించిన రోహిత్ బ్రాండ్ విలువ క్ర‌మంగా పెరుగుతున్న‌ది. క్రోల్ నివేదిక ప్ర‌కారం.. రోహిత్ శర్మ 41 మిలియన్ డాలర్లతో నాల్గవ స్థానంలో ఉన్నాడు. 

సచిన్ టెండూల్కర్

ప్ర‌పంచ క్రికెట్ లో లెజెండ‌రీ ప్లేయ‌ర్. గాడ్ ఆఫ్ క్రికెట్ గా ప్ర‌సిద్ది చెందిన స‌చిన్ టెండూల్క‌ర్ 91 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఎంఎస్ ధోని

మూడు ఫార్మాట్ ల‌లో భార‌త్ ను ఛాంపియ‌న్ గా నిల‌బెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని బ్రాండ్ విలువ $95 మిలియన్లకు చేరుకుంది. అత్య‌ధిక బ్రాండ్ విలువ క‌లిగిన క్రికెట‌ర్ల‌లో రెండో స్థానంలో ఉన్నాడు. 

విరాట్ కోహ్లీ

కేవ‌లం క్రికెట‌ర్ల ప‌రంగానే కాకుండా దేశంలోనే అత్య‌ధిక బ్రాండ్ విలువ క‌లిగిన సెలబ్రిటీ విరాట్ కోహ్లీ. క్రోల్ ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో భారత సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లి 227 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఈ లిస్టులో టాప్ లో ఉన్నాడు. క్రికెట్ ప్రపంచంలో అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్‌గా తన హోదాను సుస్థిరం చేసుకున్నాడు.

Latest Videos

click me!