ఏ బౌలర్ కూడా మూడు ఫార్మాట్లు ఆడలేడు.. బుమ్రా మినహాయింపు కాదు : విండీస్ మాజీ బౌలర్ కామెంట్స్

Published : Feb 28, 2023, 02:35 PM IST

Jasprit Bumrah: గత ఆరేడు నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న బుమ్రా.. తాజాగా ఐపీఎల్ నుంచి కూడా  తప్పుకున్న విషయం తెలిసిందే.  వెన్నునొప్పి నుంచి కోలుకున్నా బౌలింగ్ చేయడానికి బుమ్రా ఇంకా ఇబ్బందులు పడుతున్నాడు. 

PREV
16
ఏ బౌలర్ కూడా  మూడు ఫార్మాట్లు ఆడలేడు.. బుమ్రా మినహాయింపు కాదు : విండీస్ మాజీ బౌలర్ కామెంట్స్

టీమిండియా  పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా గత ఏడెనిమిది నెలలుగా  క్రికెట్ నుంచి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.   ఈ ఏడాది జనవరిలో అతడు  భారత జట్టులో చోటు దక్కించుకున్నా  శ్రీలంకతో వన్డే సిరీస్ ముందు  మళ్లీ గాయంతో అతడిని తప్పించారు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆడతాడని భావించినా  అదీ జరగలేదు.  

26

కాగా జస్ప్రీత్ బుమ్రాపై తాజాగా వెస్టిండీస్ దిగ్గజ పేసర్ ఇయాన్ బిషప్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా  మ్యాచ్ విన్నర్ అని..  భారత విజయాల్లో అతడు కీలక పాత్ర పోషించాడని  చెప్పాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  బిషప్ బుమ్రా గురించి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 
 

36

బిషఫ్ మాట్లాడుతూ... ‘బుమ్రా బౌలింగ్ లో   మంచి పేస్ ఉంటుంది.  అతడు మ్యాచ్ విన్నర్. మ్యాచ్ ను ఏ క్షణంలో అయినా  మార్చేయగలడు.  చాలాకాలంగా అతడు భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.   రాబోయే రోజుల్లో కూడా అతడి ఫిట్నెస్ పై భారత విజయాలు ఆధారపడి ఉంటాయి. 

46

దీనిని పరిగణనలోకి తీసుకుని అతడు కొన్ని  మ్యాచ్ లు  కోల్పోయినా ఫర్లేదు గానీ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలి.  ఫాస్ట్ బౌలర్లకు రెస్ట్ చాలా అవసరం. ఏ బౌలర్ కూడా మూడు ఫార్మాట్లలో సుదీర్ఘకాలం కొనసాగలేడు..  నేను కూడా రెండు ఫార్మాట్లు ఆడాను.  నాకు కూడా వెన్నునొప్పి సమస్యలు వేధించాయి. 
 

56

ఇప్పుడున్నవారిలో మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్ వంటి వాళ్లను చూడండి. వాళ్లు మూడు ఫార్మాట్లలో ఆడేవాళ్లు కాదు.   స్టార్క్  కేవలం ఆస్ట్రేలియా తరఫున వన్డేలు,   టెస్టులు మాత్రమే ఆడతాడు.  లీగ్ లు, ప్రధాన టోర్నీలు ఉన్నా తనకు  శరీరం సహకరించకుంటే తప్పుకుంటాడు. అందుకే ఇప్పటికీ అతడిలో అంత పేస్ ఉంది... బుమ్రా కూడా  సుదీర్ఘకాలం  కొనసాగాలంటే అతడికీ విశ్రాంతి అవసరం...’అని చెప్పాడు. 

66

కాగా  ఐదు నెలలుగా  గాయంతో సతమతమవుతున్న బుమ్రా.. తాజాగా ఐపీఎల్ నుంచి కూడా  తప్పుకున్న విషయం తెలిసిందే.  వెన్నునొప్పి నుంచి కోలుకున్నా బౌలింగ్ చేయడానికి బుమ్రా ఇంకా ఇబ్బందులు పడుతున్నాడు.  వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ను దృష్టిలో ఉంచుకుని అతడిని ఐపీఎల్ కు పక్కనబెట్టడమే బెటర్ అనే భావనలో  బీసీసీఐ ఉంది.

click me!

Recommended Stories