టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో చోటు దక్కించుకోవడానికంటే ముందే టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉన్నాడు ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. తొలి ఓవర్‌లో వికెట్ తీయడం, అవసరమైతే బ్యాటుతో భారీ సిక్సర్లు బాది మ్యాచ్‌ని మలుపు తిప్పడం ఇర్ఫాన్ పఠాన్ స్పెషాలిటీ. అయితే ఇర్ఫాన్ పఠాన్‌కి రావాల్సినన్ని అవకాశాలైతే రాలేదు...
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమ్‌లో చోటు కోల్పోయిన ప్లేయర్లలో ఇర్ఫాన్ పఠాన్ ఒకడు. వీరేంద్ర సెహ్వాగ్, అజిత్ అగార్కర్, హర్భజన్ సింగ్, యూసఫ్ పఠాన్ వంటి లెజెండరీ ప్లేయర్లను సైడ్ చేసినట్టే మాహీ కెప్టెన్సీలో ఇర్ఫాన్ పఠాన్‌ని కూడా పక్కనబెట్టేసింది టీమిండియా మేనేజ్‌మెంట్...
28
టీమిండియా తరుపున 29 టెస్టులు ఆడిన ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ తర్వాత టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన భారత బౌలర్‌గా ఉన్నాడు. పాకిస్తాన్‌పై టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన ఇర్ఫాన్ పఠాన్, తన కెరీర్‌లో 100 టెస్టు వికెట్లు తీశాడు...
38
భారత జట్టు తరుపున 120 వన్డేలు ఆడిన ఇర్ఫాన్ పఠాన్ 173 వికెట్లు తీయడమే కాకుండా 1544 పరుగులు చేశాడు. 24 టీ20 మ్యాచుల్లో 28 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా 300 అంతర్జాతీయ వికెట్లు తీసిన ఇర్ఫాన్ పఠాన్, బ్యాటుతో 12 హాఫ్ సెంచరీలు, టెస్టుల్లో ఓ సెంచరీ చేశాడు...
48
టీ20 వరల్డ్ కప్ 2007 ఫైనల్‌లో 3 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన ఇర్ఫాన్ పఠాన్, మాహీ కెప్టెన్సీలో ఇమడలేకపోయాడు. స్వింగ్ బౌలర్‌గా టీమ్‌లోకి వచ్చిన ఇర్ఫాన్ పఠాన్‌ని బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా మార్చాలని టీమ్ మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది...
58
ఓపెనర్‌గా, వన్‌డౌన్ ప్లేయర్‌గా వచ్చి అదరగొట్టిన ఇర్ఫాన్ పఠాన్, బౌలింగ్‌లో మునుపటి మెరుపులు చూపించలేక జట్టులో చోటు కోల్పోయాడు. తాను ఆడిన ఆఖరి వన్డేలో 5 వికెట్లు తీసినా ఇర్ఫాన్ పఠాన్‌కి 2012 తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు...
68
27 ఏళ్ల వయసులో చివరిగా భారత జట్టుకి ఆడిన ఇర్ఫాన్ పఠాన్, దాదాపు 8 ఏళ్లు ఎదురుచూసి 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు ఇర్ఫాన్ పఠాన్. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో అదరగొడుతున్న ఇర్ఫాన్ పఠాన్ గురించి ఓ క్రికెట్ ఫ్యాన్ వేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది...
78
‘ఈ లీగుల్లో ఇర్ఫాన్ పఠాన్ చూసిన ప్రతీసారీ నాకు ఎంఎస్ (ధోనీ), ఆయన మేనేజ్‌మెంట్‌పై మరింత ద్వేషం పెరుగుతుంది. ఇలాంటి ప్లేయర్ తన 29 ఏళ్ల వయసులో చివరి వైట్ బాల్ ఆడాడంటే నమ్మశక్యంగా లేదు. నెం.7 ప్లేస్‌లో పర్ఫెక్ట్ ప్లేయర్. ఏ టీమ్ అయినా ఇలాంటి ప్లేయర్ కావాలని కోరుకుంటుంది... కానీ ఇండియా మాత్రం జడ్డూని ఆడించింది... చివరికి బిన్నీ కూడా’ అంటూ ట్వీట్ చేశాడు...
88
ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ వంటి ప్లేయర్ల కంటే తన స్నేహితులు సురేష్ రైనా, ఆర్‌పీ సింగ్‌లను ఆడించడానికే ఎంఎస్ ధోనీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడని యువరాజ్ సింగ్ కూడా ఇంతకుముందు ఆరోపించాడు. ఇర్ఫాన్ పఠాన్ ఈ ట్వీట్‌కి చాలా హుందాగా స్పందించాడు. ‘దయచేసి ఎవ్వరినీ నిందించవద్దు... నీ ప్రేమకు థ్యాంక్యూ’ అంటూ కామెంట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్..