ఏంటి రాహుల్ నీక్కూడా కోపం వస్తుందా... ద్రావిడ్ కొట్లాడడం చూసి షాకైన షోయబ్ అక్తర్...

Published : Aug 21, 2022, 03:42 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో భారత్‌, పాకిస్తాన్‌తో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక వంటి మిగిలిన దేశాలు కూడా పాల్గొంటున్నాయి. అయితే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కి వస్తున్న, వచ్చిన హైప్... మిగిలిన మ్యాచులకు రావడం లేదు. ఆ హైప్‌ని మరింత క్యాష్ చేసుకునేందుకు స్టార్ స్పోర్ట్స్‌ స్పెషల్ ప్రోగ్రామ్స్‌ చేస్తోంది. భారత్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్, పాకిస్తాన్ నుంచి షోయబ్ అక్తర్ పాల్గొంటున్న ఈ ‘ఫెనిమీస్’ ప్రోగ్రామ్‌లో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి...

PREV
17
ఏంటి రాహుల్ నీక్కూడా కోపం వస్తుందా... ద్రావిడ్ కొట్లాడడం చూసి షాకైన షోయబ్ అక్తర్...

ఎంతో కూల్‌గా, కామ్‌గా కనిపించే రాహుల్ ద్రావిడ్, క్రీజ్‌లో ప్రత్యర్థిపై ఆవేశాన్ని చూపించింది చాలా తక్కువ. అదీ కోపంతో కొట్లాడేందుకు ముందుకొచ్చిన సందర్భాలైతే చాలా అరుదు. అందుకే రాహుల్ ద్రావిడ్‌తో గొడవ పడేందుకు కూడా మనసొప్పేది కాదని షోయబ్ అక్తర్ చాలా సార్లు చెప్పాడు...

27

అయితే 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ద్రావిడ్ వీరావేశానికి లోనయ్యాడు. ఆ మ్యాచ్‌లో 36 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన షోయబ్ అక్తర్, రాహుల్ ద్రావిడ్‌ని సెడ్జింగ్ చేశాడు...

37

‘ఆ మ్యాచ్‌లో రాహుల్ ద్రావిడ్‌ని నేను ఏదో మాట అన్నాను. అంతే అతను ఆవేశంగా నా వైపు కొట్లాటకి వచ్చాడు. మేమిద్దరం ఒకరినొకరం ఆవేశంగా చూసుకున్నాం...అంతకుముందు కొద్దిసేపటి ముందే నాన్‌స్ట్రైయికర్‌లో మహ్మద్ కైఫ్ ఉన్నాడు... నేను బౌలింగ్‌ వేయడానికి ముందే కైఫ్, క్రీజు దాటాడు... నేనేం అనలేదు...

47

అయితే నాకు చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కైఫ్‌ని అవుట్ చేశా. ఆ తర్వాత యువరాజ్ కూడా అవుట్ అయ్యాడు. మేం విజయానికి చాలా దగ్గరగా ఉన్నాం. ఆ సమయంలో ద్రావిడ్‌ని అవుట్ చేస్తే గెలిచేయొచ్చని అతని ఏకాగ్రత దెబ్బతీయడానికి ఏదో అన్నాను...

57

అంతే అతను నా దగ్గరికి దూసుకొచ్చి, కోపంగా గొడవ పడ్డాడు... నేను, ద్రావిడ్‌ని ఎప్పుడలా చూడలేదు. అతన్ని అలా చూసి షాక్ అయ్యా... ‘రాహుల్... నీకు కోపం కూడా వస్తుందా... ఎలా? వాతావరణం మారుతోందని తెలుసు కానీ నువ్వు కూడా గొడవ పడతావని తెలీదు...’ అంటూ అన్నాను. ఆ మాటకి ద్రావిడ్ శాంతించి, వెనక్కి వెళ్లిపోయాడు...

67

రాహుల్ ద్రావిడ్ అంటే నాకు ఎంతో ఇష్టం. అతను ట్రూ జెంటిల్‌మెన్. అయితే ఆ స్పెల్, నేను వేగంగా బౌలింగ్ చేశా. 2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత నేను టీమిండియాపై బాగానే ప్రభావం చూపించగలిగా...’ అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్...

77

2004 ఛాంపియన్స్ ట్రోఫీలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లకు ఆలౌట్ అయ్యింది. రాహుల్ ద్రావిడ్ 67 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరంభంలో వరుస వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్, ఆఖరి ఓవర్‌లో లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 

click me!

Recommended Stories